తెలుగు
సినిమా పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ ను ఏర్పరచుకున్న వారిలో
శ్రీను వైట్ల ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం
లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలను రూపొందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మెల్లి మెల్లిగా ఈయన యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లను రూపొందించాడు. ఇకపోతే ఈయనకు కెరియర్లో ఆనందం
సినిమా ద్వారా మొట్ట మొదటి
బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఈ సినిమాతో ఈయన క్రేజ్ తెలుగు లో భారీగా పెరిగింది. ఆ తర్వాత కూడా ఈయన మంచి విజయాలను అందుకుంటూ వచ్చాడు. ఈయనకు డీ , రెడీ సినిమాల ద్వారా అద్భుతమైన విజయాలు వచ్చాయి.
ఈ
మూవీ లతో ఈయన క్రేజ్ తెలుగు లో భారీగా పెరిగింది. అలాంటి సమయం లోనే ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబు
హీరో గా
సమంత హీరోయిన్గా దూకుడు అనే పవర్ఫుల్ యాక్షన్ , ఫ్యామిలీ ప్లస్
కామెడీ ఎంటర్టైనర్
మూవీ ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ
మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది.
ఈ
మూవీ విజయంతో
శ్రీను వైట్ల క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఇక దూకుడు లాంటి పవర్ఫుల్ హిట్ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన ఏ
సినిమా కూడా ఇప్పటి వరకు ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. తాజాగా ఈ దర్శకుడు గోపీచంద్
హీరో గా కావ్య దావర్
హీరోయిన్ గా టి జి విశ్వ
ప్రసాద్ నిర్మాణంలో ఈ
మూవీ ని రూపొందించాడు. మంచి అంచనాలు నడప విడుదల ఈ
సినిమా కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.