ఎన్టీఆర్ తో అలా చేయాలనేదే నా డ్రీమ్ అంటున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే..?
ప్రజెంట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్‌ను తన ఖాతాలు వేసుకుని మంచి జోష్‌లో ఉంది ఐశ్వర్య .. ఈ సినిమాలో భాగ్యమ్ పాత్రలో నటించిన ఈమె తన కెరియర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్ తో మెప్పించింది .. అంతేకాకుండా ఆమె నటనకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి .. కామెడీతో ఆకట్టుకున్న ఐశ్వర్య కు ఇప్పుడు టాలీవుడ్లో భారీ క్రేజ్ వచ్చి పడింది .. ఇప్పుడిప్పుడే ఈ తెలుగు హీరోయిన్ కు ఆఫర్లు వస్తున్నాయి .. రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య పలు ఆసక్తికర కామెంట్లు చేసింది.
తనకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని .. ఆయనను స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి చూస్తున్నానని ఆయన డాన్స్ అంటే నాకు ఎంతో ఇష్టమని చెప్పింది ఆయనతో నటించే అవకాశం వస్తే కచ్చితంగా అది వదులుకోనని .. ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ డాన్స్ యాక్టింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది .. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటించే తీరు తనకు ఎంతో నచ్చుతుందని కూడా చెప్పుకొచ్చింది .. అలాగే ఆయనతో పనిచేయాలని చాలాకాలంగా ఎదురు చూస్తున్నానని .. అవకాశం ఇప్పటివరకు తనకు రాలేదని రాబోయే రోజుల్లో ఈ అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా అది వదులుకోనని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.