![షాక్: త్రివిక్రమ్ పై.. మరోసారి పూనమ్ కౌర్ ఫైర్..!](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/movies/movies_latestnews/shock-trivikram-pai-marosari-poonamkour-firea040f922-4252-42b2-b6f2-eea956a28449-415x250.jpg)
షాక్: త్రివిక్రమ్ పై.. మరోసారి పూనమ్ కౌర్ ఫైర్..!
అయితే ఇప్పటివరకు త్రివిక్రమ్ వల్ల తనకు అన్యాయం జరిగిందని చెప్పిన ఈమె.. అసలు ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు.. ఇప్పుడు తాజాగా మరొకసారి మాట్లాడుతూ పలు రకాల ఆరోపణలు చేసింది. తాను త్రివిక్రమ్ వల్లే అన్ని ఆపేశానని.. ఆయన వల్లే సినిమాలకు కూడా దూరం అయ్యాననే విధంగా పరోక్షంగా కామెంట్స్ చేసిందట. ఇటీవలే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో ఈ విషయంపై విషెస్ చెబుతూ ఉండగా పూనమ్ కౌర్ కూడా జై బాలయ్య అంటూ తన ట్విట్టర్ నుంచి వెల్లడించిందట..
ఈ సమయంలోనే ఒక నెటిజన్ ఇప్పుడు మీరేం చేస్తున్నారనే ప్రశ్నించగా అప్పట్లో తను సినిమాలు చేసేదాన్ని కానీ త్రివిక్రమ్ తో పాటుగా కొన్ని గ్రూప్స్ చేసిన టార్చర్ వల్ల అన్ని ఆపేశాను అంటూ వెల్లడించింది.. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో అసలు ఇష్యూ ఏంటి అనే విషయం పూనమ్ కౌర్ నీ నెట్టిజెన్స్ సైతం అడుగుతున్నారు. పూనమ్ కౌర్ గతంలో ఎన్నో చిత్రాలలో నటించి బిజీగా ఉన్న ఈమె ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమైంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ ఏదో ఒక విషయాల పైన స్పందిస్తూ ఉంటుంది.