![చరణ్ గత 5 సినిమాల కలెక్షన్ల లెక్కలివే.. ఆ సినిమాలకు కేవలం ఇంతే వచ్చాయా?](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/breaking/134/reason-for-the-failure-of-game-changer-what-do-fans-say17926fb4-a6c6-4030-b93d-30b2d63b8037-415x250.jpg)
చరణ్ గత 5 సినిమాల కలెక్షన్ల లెక్కలివే.. ఆ సినిమాలకు కేవలం ఇంతే వచ్చాయా?
రామ్ చరణ్, చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన ఆచార్య మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు ఫుల్ రన్ లో కేవలం 50 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలైన నెల రోజులకే ఈ సినిమా రిలీజ్ కావడం ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాకపోవడం మైనస్ అయింది. చరణ్, ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ మాత్రం ఏకంగా 600 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
రామ్ చరణ్ వినయ విధేయ రామ ఫుల్ రన్ లో కేవలం 63 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లకు పరిమితమైంది. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం మూవీ ఫుల్ రన్ లో 124 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. 2018 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఆ సమయానికి ఈ రేంజ్ కలెక్షన్లు అంటే ఏ మాత్రం సాధారణమైన విషయం కాదు.
రామ్ చరణ్ మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకున్న ప్రతి సందర్భంలో ఈ హీరోకు ఒకింత భారీ విజయాలు దక్కాయి. కథల ఎంపికలో రామ్ చరణ్ జాగ్రత్త వహించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ హీరో రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాజెక్ట్ లతో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. రెమ్యునరేషన్ విషయంలో సైతం రామ్ చరణ్ ఒకింత టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.