![వరుసగా 4 సినిమాలు బ్లాక్ బస్టర్..బాలయ్య ఊర మాస్ జాతర ?](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/movies/business_videos/balayya60bf29c0-6e0c-4076-ad72-c4a354e3b02b-415x250.jpg)
వరుసగా 4 సినిమాలు బ్లాక్ బస్టర్..బాలయ్య ఊర మాస్ జాతర ?
అయితే ఈ సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించారు. కానీ జనాలకు పెద్దగా ఈ సినిమా నచ్చలేదు. దీంతో బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టారు బాలయ్య. ఇక ఆ తర్వాత మరోసారి.. బోయపాటి కాంబినేషన్ లో అఖండ సినిమా తీశారు నందమూరి బాలయ్య. దీంతో నందమూరి బాలయ్య మళ్ళీ సక్సెస్ బాట పట్టారు. 60 కోట్లతో అఖండ సినిమా తీస్తే.... 150 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం అఖండ 2 సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక అఖండ సినిమా తర్వాత... వీర సింహారెడ్డి సినిమాతో సంక్రాంతి కానుకగా 2023 సంవత్సరంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు నందమూరి బాలయ్య. ఈ సినిమా బడ్జెట్ 110 కోట్లు కాదా... దాదాపు 150 కోట్లు వచ్చి... పాజిటివ్ టాక్ తెచ్చుకుంది వీర సింహారెడ్డి సినిమా. కాస్త ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో... సినిమా పెద్దగా హిట్ కాలేదు.
ఆ తర్వాత అనిల్ రావిపూడి తో నందమూరి బాలయ్య భగవంతు కేసరి సినిమా తీశారు. ఈ సినిమా 65 కోట్ల బడ్జెట్ తో తీస్తే..... బ్లాక్ బాస్టర్ గా నిలిచి 150 కోట్లు వసూలు చేసింది. ఇలా ప్రతి సినిమా 150 కోట్లు... వసూలు చేసేలా నందమూరి బాలయ్య దూసుకు వెళ్తున్నారు. ఇక మొన్నటి సంక్రాంతి సమయంలో డాకు మహారాజు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు నందమూరి బాలయ్య. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే దాదాపు 200 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి.