ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్‌లో అత్యధిక వసూళ్లను సొంతం చేసుకున్న ఈ సినిమా టాప్ చిత్రాల జాబితాలో చేరింది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకోవడం ద్వారా 'కల్కి 2898 ఏడీ' సినిమా సీక్వెల్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. కథను మధ్యలో ముగించిన నాగ్ అశ్విన్ దానికి ఎలాంటి ముగింపు ఇస్తాడా అని ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ కల్కి సీక్వెల్‌పై స్పందించారు. వచ్చే ఏడాది చివరి వరకు సినిమా విడుదల ఉండే అవకాశం ఉందని అన్నారు.ఇదిలావుండగాతాజా సమాచారం ప్రకారం కల్కి సెకండ్ పార్ట్ షూటింగ్ జూన్ మొదటి వారం నుంచి మొదలవనుందని, మొదటి షెడ్యూల్ లో కమల్ హాసన్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కల్కిలో యాస్కిన్ సుప్రీమ్ గా తెరపై కనిపించింది కాసేపే అయినా తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశాడు కమల్.ఐతే, కల్కి సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది అని, జూన్ ఫస్ట్ వీక్ నుంచి షూట్ స్టార్ట్ కానుంది అని, మొదటి షెడ్యూల్ లో కమల్ హాసన్ పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తారని తెలుస్తోంది.కల్కి సీక్వెల్ లో కమల్ హాసన్ కి సంబంధించిన పార్ట్ ఎక్కువ ఉంటుందట. ‘కల్కి సీక్వెల్’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నారని టాక్. పైగా ఈ సీక్వెల్ లో పురాణాల లెంగ్త్ ఎక్కువగా ఉంటుందట. ఎలాగూ కల్కి ఎండింగ్ ను కూడా కర్ణుడు పాత్ర పై ముగించారు కాబట్టి, కల్కి సీక్వెల్ మొత్తం కర్ణ పాత్ర చుట్టూ తిరుగుతందనే అనుకోవాలి. ‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె.. పార్ట్ 2లోనూ కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపించనుంది.