![గేమ్ ఛేంజర్ ఫలితంతో మారిన దిల్ రాజు.. అలాంటి సినిమాలనే నిర్మిస్తారా?](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/movies/movies_latestnews/game-changer-ott-amazon-febery-14503fb44e-f3a9-4cfa-8616-6d2a697cdd40-415x250.jpg)
గేమ్ ఛేంజర్ ఫలితంతో మారిన దిల్ రాజు.. అలాంటి సినిమాలనే నిర్మిస్తారా?
ప్రస్తుతం ఎస్వీసీ బ్యానర్ లో షూటింగ్ ను పూర్తి చేసుకున్న సినిమా తమ్ముడు కాగా మరో రెండు సినిమాలు త్వరలో సెట్స్ పైక్ వెళ్లనున్నాయి. ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రమే నిర్మాతగా దిల్ రాజుకు పూర్వ వైభవం వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. సినిమాలకు సంబంధించి దిల్ రాజు పర్యవేక్షణ మాత్రమే చుసుకోనున్నారని సమాచారం అందుతోంది.
తన కుటుంబ సభ్యులు సైతం సినిమాలకు సంబంధించి ఇన్వాల్వ్ అయ్యే విధంగా దిల్ రాజు ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎస్వీసీ బ్యానర్ సక్సెస్ రేట్ తగ్గడంతో పాటు ఈ బ్యానర్ కు వరుస షాకులు తగులుతున్న నేపథ్యంలో దిల్ రాజు నిర్ణయం ఎంతమేర ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సి ఉంది. దిల్ రాజుకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ వల్ల కొంతమేర నష్టాలు తగ్గినా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది.
పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ విషయంలో దిల్ రాజు తెలివిగా అడుగులు వేయాల్సి ఉంది. కేవలం కాంబినేషన్లను మాత్రమే నమ్ముకోకుండా మంచి ప్రాజెక్ట్స్ ను ఎంచుకుంటే మాత్రమే దిల్ రాజుకు పూర్వ వైభవం దక్కుతుందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో నిర్మాత దిల్ రాజు ఖాతాలో భారీ విజయాలు చేరతాయో లేదో అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.