ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు తీసి డైరెక్టర్ గా మణిరత్నం దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన డైరెక్షన్ లో ఎన్నో ఆణిముత్యాల లాంటి సినిమాలు వచ్చాయి.అలాగే ఈయన దర్శకత్వంలో నటించిన చాలామంది హీరోలు స్టార్స్ కూడా అయ్యారు. అయితే అలాంటి మణిరత్నం డైరెక్షన్ నుండి వచ్చిన బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ అయినటువంటి సఖి మూవీ అందరూ చూసే ఉంటారు.ఈ సినిమా తెలుగు, తమిళ,హిందీలో కూడా విడుదలైంది.సఖి మూవీ లో మాధవన్, శాలిని హీరో హీరోయిన్ గా చేశారు.. అయితే సఖి మూవీకి మొదట అనుకున్న హీరో హీరోయిన్ వీళ్లు కాదట. వేరే హీరో హీరోయిన్ ని మణిరత్నం అనుకున్నారట. కానీ వారిద్దరి కాంబోలో మిస్సయి సడన్గా ఈ ప్రాజెక్టులోకి మాధవన్, శాలిని వచ్చి పడ్డారు.మరి ఇంతకీ మణిరత్నం ఈ సినిమాకి ముందుగా అనుకున్న హీరో హీరోయిన్ ఎవరు ఇప్పుడు చూద్దాం..
మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో సఖి మూవీ కూడా ఒకటి. ఈ సినిమా తమిళంలో అలై పాయుతే అనే టైటిల్ తో తెరకెక్కింది. ఇక ఇదే సినిమాని తెలుగులో సఖి అనే పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమాలో మాధవన్, శాలిని కంటే ముందు బాలీవుడ్ హీరో హీరోయిన్ అయినటువంటి షారుక్ ఖాన్ కాజోల్ ని తీసుకోవాలి అనుకున్నారట మణిరత్నం.. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన కథ చర్చలు కూడా జరిగాయట. అయితే నేను చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో షారుక్ ఖాన్ కూడా ఒప్పుకున్నారు. అయితే ఈ సినిమా షారుక్ ఖాన్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్న సమయానికి క్లైమాక్స్ ఇంకా పూర్తి కాలేదు.
క్లైమాక్స్ సరిగ్గా లేకపోవడంతో అదే షారుక్ ఖాన్ ని పెట్టి దిల్ సే అనే మూవీని చేశాను. ఇక ఈ మూవీ చేసే సమయంలోనే సఖి మూవీకి క్లైమాక్స్ ఎలా పెట్టాలో నాకు ఒక ఆలోచన వచ్చింది.ఆ తర్వాత సఖి మూవీకి క్లైమాక్స్ రాసుకున్నాను. కానీ సడన్గా ఈ సినిమా నుండి షారుక్ ఖాన్ కాజోల్ ని పక్కన పెట్టేసి మాధవన్ శాలినిని తీసుకున్నాను అంటూ మణిరత్నం తాజాగా ఓ ఇంటర్వ్యూలో సఖి మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు.