దిల్ రాజుకు ఇప్పుడు ఉంటుంది అస‌లు సినిమా...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు ఇప్పుడు టాలీవుడ్ లో గట్టి పోటీ కనిపిస్తోంది. నిర్మాతగా సితార నాగ వంశీ లాంటి వాళ్లు వరుస పెట్టి పెద్దపెద్ద ప్రాజెక్టులు సెట్ చేసుకుంటూ దిల్ రాజు కు సవాళ్లు విసురుతున్నారు. ఇక ఇతర భాషలకు చెందిన అగ్ర‌ నిర్మాతలు సైతం మన తెలుగు హీరోలతో భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు మైత్రి మూవీస్ వరుసగా పెద్ద ప్రాజెక్టులు సెట్ చేసుకుంటూ దిల్ రాజు దూకుడుకు బ్రేకులు వేస్తుంది. ఒకప్పుడు దిల్ రాజు టాలీవుడ్ లో అగ్ర హీరోల కాల్ సీట్లు వ‌రుస పెట్టి బ్రేక్ చేస్తూ తన ఆధిపత్యం చాటుకునేవారు. ఇప్పుడు సీతారా నాగ వంశీ - మైత్రి లాంటివాళ్ళు అటు కన్నడ హోంబ‌లే ఫిలిమ్ లాంటి వాళ్ళు కూడా తెలుగులో అగ్ర హీరోలతో పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. దిల్ రాజు లాంటి పెద్ద బ్యానర్ నుంచి చెప్పుకోదగ్గ ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేదు.


ఇప్పుడు నితిన్ - విజయ్ దేవరకొండ ఇలాంటి హీరోలతో మిడిల్ రేంజ్ సినిమాలు చేస్తున్నారు. అమీర్ ఖాన్ తో సినిమా అంటున్న అది ఎప్పటికీ సెట్స్ మీదకు వెళుతుందో ? తెలియదు. తాజాగా శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమా తీస్తే ఘోర పరాజ‌యం ఎదురయింది. ఇక నైజాంలో ఒకప్పుడు పంపిణీరంగంలో దిల్ రాజు ఏం చెబితే అది నడిచేది. ఇప్పుడు మైత్రి మూవీస్ నైజాం పంపిణీ రంగంలోకి ఎంటర్ కావడంతో దిల్ రాజుకు గట్టి పోటీ తగులుతోంది.


ఇక దిల్ రాజుకు అక్కడ ఇబ్బందులు తప్పేలా లేదు. మరోవైపు వైజాగ్ లో కూడా దిల్ రాజుకు పంపిణీ పరంగా గట్టి పోటీ ఉంది. నైజాంలో సితార హారిక సంస్థ ఒక్కటే దిల్ రాజుకు ఇప్పటి వరకు బలమైన వెన్నుదన్నుగా ఉంది. కానీ డాకు మహారాజు రిలీజ్ విషయంలో ఆ సంస్థతో కూడా చిన్నపాటి గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది. ఈ సమస్య సెటిల్ కాకపోతే నైజం లో దిల్ రాజు సంస్థకు పంపిణీ పరంగా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది నుంచి దిల్ రాజుకు నిర్మాతగాను పంపిణీ రంగంలోనూ.. బయ్యర్ గాను ముళ్ళబాట మీదే నడవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: