
అసలు ఇష్టం లేకుండా టైంపాస్ గా రాజమౌళి చేసిన మూవీ ఏంటో తెలుసా..? సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్..!
ఇది నిజంగా రాజమౌళికే చెల్లిందని చెప్పాలి . అయితే రాజమౌళి తన కెరియర్ లో ప్రతిదీ కూడా మంచిగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు . కానీ ఒక సినిమాని మాత్రం రాజమౌళి చాలా కూల్ గా ఆడుతూ పాడుతూ సరదాగా తెరకెక్కించేశారు . ఆ మూవీ మరేంటో కాదు "మర్యాద రామన్న". కేవలం 6 నెలల్లోనే ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసేసారు . సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అసలు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుంది అని రాజమౌళి కూడా ఊహించలేకపోయారట .
ప్రజెంట్ మహేష్ బాబుతో సినిమా కోసం బాగా బాగా కష్టపడుతున్నారు జక్కన్న . అంతేకాదు స్పెషల్ ట్రైన్నింగ్స్ కూడా తీసుకుంటున్నారట. మహేష్ బాబు దగ్గర నుంచి పాస్ పోర్ట్ కూడా తీసేసుకున్నాడు జకన్నా. దీనికి సంబంధించిన ఒక ఫన్నీ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . అంటే ఇక మహేశ్ బాబు ని మరో నాలుగేళ్లు జక్కన్న బాగా వాడేస్తాడు అనమాటే అంటూ జనాలు బాగా ఫనీ మీమ్స్ తో ట్రెండ్ చేస్తున్నారు..చూద్దాం మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో..?