బంగారం ఇలాంటి ఆఫర్ కొట్టేసిన భాగ్యం.. ఇంకో హిట్ పక్కా.. నో డౌట్..!

Thota Jaya Madhuri
ఐశ్వర్య రాజేష్.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు గురించి జనాలు పెద్దగా పట్టించుకోలేదు . అయితే ఒకే ఒక్క సినిమాతో ఆమె తన కెరీర్ నే మార్చేసుకుంది . ఎంతలా అంటే ఇప్పుడు బడా పాన్ ఇండియా స్టార్స్ కన్నా కూడా ఐశ్వర్య రాజేష్ పేరే ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ వార్త వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే.. ఐశ్వర్య రాజేష్ ఓ టాలెంటెడ్ హీరోయిన్ . ఎలాంటి రోల్స్నైనా సరే అవలీలగా నటించేస్తుంది. 



అయితే ఐశ్వర్య రాజేష్ ఎందుకు తెలుగులో అవకాశాలు అందుకోలేకపోయింది అనేది అందరికి బిగ్ క్వశ్చన్ మార్క్. రీసెంట్గా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ఆఫర్ అందుకుంది.  ఈ సినిమాలో నటించి తన కెరీయర్ నే మార్చేసుకుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . కాగా ఈ సినిమా తర్వాత ఐశ్వర్యరాజేష్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . కాగా ఇప్పుడు ఐశ్వర్యరాజేష్ ఖాతాలో బిగ్ ఆఫర్ వచ్చి చేరిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయ్.



అది కూడా పాన్ ఇండియా సినిమా . గేమ్ చేంజర్ సినిమా తో అట్టర్ ప్లాప్ తన ఖాతాలో వేసుకున్న.. రాంచరణ్ ప్రజెంట్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్ చకచక కంప్లీట్ చేసుకుంటుంది . కాగా ఇదే మూమెంట్లో ఆమెకి ఈ సినిమాల అవకాశం వచ్చినట్లు వార్త బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . అయితే ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ సెలెక్ట్ అయిందట.  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అందరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు . ఐశ్వర్య రాజేష్ పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: