చిరు సినిమాకు అనిరుధ్.. మెగాస్టార్ ను లేపుతాడో, పడేస్తాడో?
ఇక అనిరుధ్ మ్యూజిక్ సెన్సేషన్ గురించి జనాలకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇతగాడు ఓ సినిమాకు సంగీతం అందిస్తున్నారంటే క్రేజ్ సాధారణంగా ఉండదు. అలాంటిది మెగాస్టర్ చిరంజీవి సినిమాకు ఆయన సంగీతం ఇస్తున్నాడు అంటే... క్రేజ్ పీక్స్ లో ఉంటుంది కదా! అవును.. మీరు విన్నది నిజమే. ఇప్పుడు అలాంటి కాంబో ఒకటి సెట్ అవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. చిరంజీవి సినిమాకు అనిరుధ్ ని అడిగినట్టు టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ మెగా అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరక్టర్స్ తో ముందుకు వెళ్తున్నారు. చిరంజీవి నటించిన భోళా శంకర్ పరాజయం తరువాత చిరు తరువాతి సినిమాపై ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. అందులో 'బింబిసార' ఫేమ్ వశిష్ట ఒకరు కాగా, దసరా సినిమాతో సెన్సేషన్ గా మారిన శ్రీకాంత్ ఓదెల ఒకరు. వశిష్ఠ 'విశ్వంభర' సినిమాను చేయగా ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఆ తర్వాత ప్రాజెక్టుని కూడా ఫైనలైజ్ చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమాకే అనిరుథ్ ని ఎంచుకున్నట్లు తెలస్తోంది. కాగా దీనికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం చేయబోతున్నారు. వాస్తవానికి చిరంజీవికి ఇలాంటి కాంబో పడాలని మెగాభిమానులు ఎంతో కాలంగా కోరుకుంటున్నారనేది నిజం. అలాంటి కాంబోనే చిరంజీవి, శ్రీకాంత్ ఓదెలది అని అంటున్నారు. శ్రీకాంత ఓదెల కూడా రొటీన్ కమర్షియల్ సినిమాలకు చాలా దూరంగా ఉంటారు. ఆయన సినిమాల్లో ఎదో ఒక బలమైన కంటెంట్ ఉంటుంది.