
ట్రంప్ నిర్ణయంతో..USAలో తెలుగు సినిమాల కలెక్షన్స్ పై భారీ దెబ్బ..!
అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలుగు సినిమాలకు ఇండియన్ సినిమాలకు అక్కడ ఎఫెక్ట్ పడేలా ఉన్నదట. ముఖ్యంగా మన సినిమా కలెక్షన్స్ పైన ట్రంప్ ఎఫెక్ట్ చాలా పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ట్రంప్ వారి దేశంలో వారికే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తున్నారని వలసదారుల పైన స్ట్రీట్ రూల్స్ పెట్టారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి స్టూడెంట్లు వీసాల మీద వెళ్లిన వారు చాలామంది అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి వీల్లేదని కండిషన్స్ కూడా పెట్టారట
అలాగే ఇండియన్ స్టోర్స్ రెస్టారెంట్లలో పని చేస్తున్న వారందరిని జాబ్ నుంచి తొలగిస్తున్నారట. అక్కడున్న స్టూడెంట్స్ పరిస్థితి చాలా పూర్తిగా మారిపోయిందని తెలుస్తోంది. మరొకవైపు పోలీసులు కూడా అక్రమ వలసదారులను వెతికి మరి పట్టుకుంటున్నారట. ముఖ్యంగా అమెరికాలో మన తెలుగు ఇండియన్ చిత్రాలను చూసే వారి సంఖ్య ఇండియా తో పోలిస్తే ఇలా పార్ట్ టైం చేసుకునే వారే ఎక్కువ మంది ఉన్నారట. ఇలాంటి పరిస్థితులలో వారు సినిమాలకు డబ్బులు పెట్టాలి అంటే చాలా ఆలోచిస్తారు. దీంతో ట్రంప్ ఎఫెక్ట్ వల్ల తెలుగు సినిమాల పైన భారీగా కలెక్షన్స్ దెబ్బ అయితే పడేలా కనిపిస్తున్నది. అక్కడ డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంతమేరకు ఆలోచిస్తున్నట్లు సమాచారం.