ఆ హీరోతో నటిస్తే సాయి పల్లవి దూల మొత్తం తీరిపోతుందా..?

Thota Jaya Madhuri

సాయి పల్లవి.. ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు . సింపుల్ హీరోయినే.. ఎక్స్పోజింగ్ అస్సలు చేయదు.  వల్గర్ మాటలు అసలకి మాట్లాడదు. కానీ ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఒక పాన్ ఇండియా స్టార్ కూడా కుల్లుకునే స్థాయిలోనే ఉంటుంది . అలాంటి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు దూసుకెళ్ళి పోతుంది అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి.  సాయి పల్లవి గురించి నెగిటివ్ గా మాట్లాడుకునే వాళ్లకన్నా పాజిటివ్ గా మాట్లాడుకునే జనాలు ఎక్కువ . సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ పైన గాని హీరో పైగాని రకరకాల రూమర్స్ వైరల్ అవుతూ ఉంటాయి.

మరీ ముఖ్యంగా ఎఫైర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే సాయి పల్లవి పేరుపై మాత్రం అలాంటి ఎఫైర్ వార్త ఒక్కటి కూడా రాకపోవడానికి కారణం ఆమె ఉన్నది ఉన్నట్లు మాట్లాడడమే . ఆమె నిజాయితీ తత్వమే అంటూ చాలామంది జనాలు మాట్లాడుకుంటూ వచ్చారు. ప్రెసెంట్ "తండేల్" సినిమాతో జనాలను పలకరించడానికి సిద్ధంగా ఉంది ఈ అందాల ముద్దుగుమ్మ . కాగా "తండేల్" సినిమాలో నాగచైతన్య కి ఓ రేంజ్ లో కాంపిటీటివ్గా ఫీల్ అవుతూ అల్లాడించేసింది అంటూ రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా తెలిసిపోతుంది.

వీళ్ళ కాంబోలో ఆల్రెడీ "లవ్ స్టోరీ" సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . కాగా ఇప్పుడు సాయి పల్లవి - నాగచైతన్య కాంబోలో ఈ సినిమా మరొక హిట్ గా ఉండబోతుంది అంటున్నారు జనాలు . అయితే సాయి పల్లవి పేరే "తండేల్" ప్రమోషన్స్ లో ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో కొంతమంది ఆమెపై నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సాయి పల్లవి హీరో అల్లు అర్జున్ తో నటిస్తే ఆమెలోని డాన్సింగ్ సత్తా ఏంటో తేలిపోతుంది అని .. స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ - సాయి పల్లవి తో స్క్రీన్ షేర్ చేసుకుని డాన్స్ విషయంలో సాయి పల్లవి - అల్లు అర్జున్ ని మించిపోయి స్థాయిలో స్టెప్స్ వేసి ఎంటర్టైన్ చేస్తే నిజంగా అప్పుడు సాయి పల్లవి గ్రేట్ అని ఒప్పుకుంటామని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు . దీంతో మరి కొంతమంది సాయి పల్లవి పై నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు . అల్లు అర్జున్ తో నటిస్తే సాయి పల్లవి దూల తీరిపోతుంది అని.. ఆయనతో డాన్స్ స్టెప్స్ మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు అని మాట్లాడుతున్నారు . సాయి పల్లవి పేరు ఈ విధంగా ట్రోలింగ్ కి గురవ్వడంపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: