జయసుధ: హీరోయిన్‌ నుంచి బామ్మ వరకు తెలుగు తనం ఒట్టిపడాల్సిందే ?

Veldandi Saikiran
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇక నేటి కాలంలో చాలా వరకు హీరోయిన్లు ఎక్స్పోజింగ్ పాత్రలు చేసుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కానీ ఒకానొక సమయంలో చాలామంది హీరోయిన్లు సాంప్రదాయంగా చీరకట్టు, బొట్టులో అందంగా కనిపించి అభిమానులను ఆకట్టుకునేవారు. అలాంటి వారిలో నటి జయసుధ ఒకరు. సహజ నటిగా ఒకానొక సమయంలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. జయసుధ స్టార్ హీరోలు అందరి సరసన నటించింది.


సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, మోహన్ బాబు, కృష్ణంరాజు, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి లాంటి ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం జయసుధ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అమ్మ, అత్త, బామ్మ వంటి పాత్రలో నటిస్తోంది. జయసుధ దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సినిమాలలో నటిస్తూ తన హవాను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా చేసిన జయసుధ ప్రస్తుతం ఆడపా దడపా సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు. హీరోయిన్ గా దశాబ్దాల కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించారు.


అనంతరం వదిన, అక్క, తల్లి, అత్త వంటి పాత్రలు చేశారు. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా బామ్మ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. జయసుధ కొన్ని వందల సినిమాలలో నటించి కోట్లాది కోట్ల ఆస్తులను సంపాదించారు. అంతేకాకుండా తాను చాలావరకు ఆస్తులను కోల్పోయారు. ఈమె హీరోయిన్ గా మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా రాణించారు. ప్రముఖ నిర్మాత వడ్డె రమేష్ సోదరుడితో గతంలో జయసుధ వివాహం జరగగా అతనితో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం 1985లో నటుడు జితేంద్ర బంధువు అయినటువంటి నిర్మాత నితిన్ కపూర్ ను వివాహం చేసుకుంది. అతనితో కూడా ఎక్కువ కాలం ఉండలేదు. జయసుధ, నితిన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నారు.


నితిన్ కపూర్ 2017లో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటినుంచి జయసుధ తన ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. కాగా, జయసుధ తాను నటించిన సినిమాలలో ప్రతి ఒక్క సినిమాలో సాంప్రదాయబద్ద పాత్రలలో మాత్రం నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చీరకట్టు, బొట్టు, చేతినిండా గాజులు ఇలా అచ్చ తెలుగు సాంప్రదాయ అమ్మాయిలాగా కనిపించి ప్రతి ఒక్కరి చూపును తన వైపుకు తిప్పుకుంది. జయసుధ ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా సాంప్రదాయంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: