ఇప్పటికీ డేంజర్ లోనే పూజ హెగ్డే కెరియర్.. ఆ సినిమాపైనే ఆశలన్నీ..?

RAMAKRISHNA S.S.
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక తమిళ , హిందీ సినిమాలలో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. 



కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలను అందుకుంటూ ఫుల్ జోష్లో ముందుకు సాగిన ఈ బ్యూటీ కెరియర్ ఈ మధ్య కాలంలో మాత్రం అంత సాఫీగా ముందుకు సాగడం లేదు. ఈమె నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ వస్తున్నాయి. ఇక పోయిన సంవత్సరం ఈమె నటించిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఈమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఈమె నటించిన చాలా సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈమె తాజాగా నటించిన వేద అనే సినిమా థియేటర్లలో విడుదల అయింది.



 బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి షాహిద్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. 
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న జన నాయగన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో అయినా ఈ బ్యూటీ మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లయితే పూజ హెగ్డే కెరియర్ భారీ స్థాయిలో డేంజర్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: