ప్రధానితో అక్కినేని ఫ్యామిలీ భేటీ .. తండేల్ మూవీ పై ఏమన్నారంటే..?
అయితే అక్కినేని నాగార్జున తండేల్ సినిమా రిలీజ్ అయినా సమయంలో ఇలాంటి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది .. అలాగే చిత్ర పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు చేసిన సేవలను కృషిని ప్రధాని మోదీ ఎంతో కొనియాడారు .. ఆ తర్వాత ప్రధాని చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .. అయితే ఇప్పుడు నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా రిలీజ్ అయిన రోజునే ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అవ్వటం ఇప్పుడు ఎంతో ఆసక్తిని పెంచుతుంది .. ఇక నాగచైతన్య , శోభితను నాగార్జున మోదీకి పరిచయం చేశారు ఇక ఇద్దరిని మోడీ ఎంతో అభినందించారు .
ఇప్పటివరకు లవర్ బాయ్‌గా పలు సినిమాల్లో నటించి మెప్పించి నాగచైతన్య తండేల్ సినిమాలో పాకిస్తాన్లో దొరుకుపోయిన జాలరిగా నటించారు .. ఇక తన పాత్రలో ఒదిగిపోయి నటించి మెప్పించారు .. ఇక ఈ భేటీ అయిన సమయంలో మోదీ చిత్ర పరిశ్రమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకున్నట్టు తెలుస్తుంది .. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో సాధించిన విజయాల గురించి వీరి మధ్య పలు చర్చకు వచ్చినట్లు సమాచారం .. ఇటు నాగచైతన్య సినీ కెరియర్ గురించి కూడా మోదీ అడిగినట్టు చెబుతున్నారు .. ప్రధానితో భేటీ తర్వాత టిడిపి ఎంపీ బైరెడ్డి శబరితో నాగార్జున ఫ్యామిలీ సమావేశం అయింది .. అయితే ఇదే మర్యాదపూర్వకంగా కలిసినట్టు చెప్తున్నారు .. కానీ ఇప్పుడు ఈ భేటీ అంశం రాజకీయంగా చిత్రపరిశ్రమలో ఎంతో హాట్ టాపిక్ గా మారింది.