ఉదయభాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు డాన్స్ బేబీ డాన్స్, వన్స్ మోర్ ప్లీజ్ అంటూ యాంకర్ గా ఉదయభాను ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో టీవీ షోలకు యాంకర్ గా పనిచేసి అలరించారు. ఆ తరవాత ఏం జరిగిందో కానీ టీవీ ప్రేక్షకులకు దూరం అయ్యారు. కట్ చేస్తే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇద్దరు ట్విన్స్ కు జన్మనిచ్చారు. ఆ తరవాత మళ్లీ బాలయ్య హీరోగా నటించిన ఓ సినిమా ఆడియో ఫంక్షన్ తో ఉదయభాను యాంకర్ గా రీఎంట్రీ ఇచ్చారు. ఆ తరవాత చాలా సినిమాల ఆడియో ఫంక్షన్స్ లో సందడి చేయడంతో పాటూ కొన్ని టీవీ షోలలోనూ కనిపించారు.
ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో నటించినా నటించకపోయినా టీవీలో కనిపించినా కనిపించకపోయినా యూట్యూబ్ లో మాత్రం వీడియోలు చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోల్లో తమ పర్సనల్ లైఫ్ తో పాటూ ఇతర అంశాలను చెబుతున్నారు. ఇక ఉదయభాను కూడా వారి దారిలోనే యూట్యూబ్ జర్నీ ప్రారంభించారు. అందులో తమ పర్సనల్ విషయాలతో పాటూ పిల్లల వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఉదయభాను ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో బాలయ్య కూతురు నారా బ్రాహ్మిణి తమ పిల్లకు వయోలిన్ గిఫ్ట్ గా ఇచ్చినట్టు పంచుకుంది. ఒక స్పెషల్ పర్సన్ మీకు గిఫ్ట్ పంపించారు. బాలయ్య మామ అంటే ఇక్కడ ఎవరికి ఇష్టం అంటూ పిల్లలకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక బాలయ్య అంటే ఉదయభానుకు ఎంతో అభిమానం అన్న సంగతి తెలిసిందే. ఉదయభాను ఓ సందర్భంలో తాను ఇండస్ట్రీకి దూరం అయినా తనకు ట్విన్స్ పుట్టినప్పుడు ఒక మెసేజ్ చేయగానే బాలయ్య ఇంటికి వచ్చారని చెప్పింది. ఆ తరవాత బాలయ్యది గొప్ప మనసు అంటూ పొగడ్తలు కూడా కురిపించారు. ఇక బ్రాహ్మిణి ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వడంతో బాలయ్య ఫ్యామిలీతోనూ తనకు అనుబంధం ఉన్నట్టు ఉదయభాను చెప్పకనే చెప్పేసింది.