
ముగ్గురు హీరోలతో కలర్స్ స్వాతి డేటింగ్ నిజమేనా..!
ఈమె మొదట కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కలర్స్ స్వాతి అష్టాచమ్మా - ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే - త్రిపుర - స్వామి రారా - కార్తికేయ లాంటి సినిమాలు హిట్టవడంతో ఆమెకు మంచి సినీ కెరీర్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా ఆమె పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి కొద్ది రోజులు గుడ్ బై చెప్పింది. పెళ్లైన కొద్ది రోజులకే ఈ హీరోయిన్ తన భర్త నుంచి దూరంగా వచ్చేసిందన్న గుసగుసలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా మంత్ ఆఫ్ మధు సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో స్వాతి రెడ్డి చాలా ఇబ్బందులు పడింది.
ఈమె విడాకులు తీసుకుంది అనే వార్త వైరల్ అవ్వడంతో ఎక్కడికి వెళ్లినా స్వాతిని విడాకులు ప్రశ్న అడిగారు.. దీంతో ఆన్సర్ చెప్పలేక విసిగిపోయింది. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో కలర్స్ స్వాతికి పెళ్లి కాకముందు టాలీవుడ్కు చెందిన కొందరు హీరోలతో లింకు పెట్టి ఎఫైర్ ఉందన్న వార్తలు బాగా ప్రచారం చేశారు. ఇందులో అల్లరి నరేష్ మొదటి వారట. డేంజర్ సినిమాలో చేసినప్పుడే ఈ హీరోయిన్ కి ఎఫైర్ వార్తలు అంటగట్టారట. అంతేకాకుండా నాని - నిఖిల్ - నవీన్ చంద్ర వంటి హీరోలతో ఆమె సినిమాలలో నటించినప్పుడు ఆ హీరోలతో కూడా డేటింగ్ చేస్తుందని వార్తలు రాశారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని ఆమె కొట్టి పడేస్తుంది.