సినీ ఇండస్ట్రీలో విభిన్న పాత్రలు పోషించిన
హీరో కం విలన్ గా జగపతిబాబుకి పేరుంది. ఈయన ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలారు.అప్పట్లో ఈయన కుటుంబ కథా సినిమాలకు ఎంతోమంది ప్రేక్షకులు అభిమానులు అయ్యారు. అలా కుటుంబ కథా హీరోగా పేరు తెచ్చుకున్న వారిలో జగపతిబాబు కూడా ఒకరు. అయితే అలాంటి జగపతిబాబు పెళ్లయ్యాక కూడా ఓ
హీరోయిన్ పై మనసు పడ్డాడని,ఆ
హీరోయిన్ కోసం చివరికి చచ్చిపోవాలనుకున్నాడట. మరి ఇంతకీ ఆ
హీరోయిన్ ఎవరయ్యా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది కేవలం
సౌందర్య పేరు మాత్రమే.అయితే జగపతిబాబుకి సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలో హీరొయిన్ కళ్యాణి,
ప్రియమణి వంటి హీరోయిన్లతో ఎఫైర్ వార్తలు వచ్చాయి. అలాగే స్టార్
హీరోయిన్ సౌందర్య తో కూడా జగపతిబాబు ప్రేమలో పడ్డారని,అందుకే వీరి కాంబోలో ఎక్కువ సినిమాలు వచ్చాయనే వార్తలు వినిపించాయి.
అయితే సౌందర్యతో ప్రేమలో పడ్డ విషయం అటుంచితే
సౌందర్య అంటే జగపతిబాబుకి చెప్పలేనంత ఇష్టమట. అయితే ఈ విషయాన్ని జగపతిబాబు
సౌందర్య మరణించాక కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొని బాధపడ్డారు.
సౌందర్య మరణించాక నా బాధ చెప్పడానికి మాటలు లేవు.ఆమె చనిపోయాక ఒక్క క్షణం నేను కూడా చచ్చిపోవాలి అనే నిర్ణయం తీసుకునేంతలా నా మైండ్ మారిపోయింది.
సౌందర్య అంటే ఎనలేని అభిమానం
ప్రేమ అంటూ జగపతిబాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇదే విషయం గురించి సినీ జర్నలిస్ట్ ఈ మంది రామారావు మాట్లాడుతూ.. జగపతి బాబుకి
సౌందర్య అంటే నిజంగానే ప్రేమ.
ఆమె చనిపోయింది అనే మరణ వార్త వినగానే ఆయన కూడా చనిపోదాం అని డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అంతేకాదు చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యారు. కానీ ఆ తర్వాత ఫ్యామిలీ గురించి ఆలోచించి వెనక్కి తగ్గారు అంటూ ఈమంది రామారావు చెప్పారు.అయితే ఇదే విషయంపై జగపతిబాబు మాట్లాడుతూ..
సౌందర్య అంటే నిజంగానే నాకు ప్రేమ.కానీ ఆమె మరణించాక ఆమె ఫ్యామిలీ పైనే నా ఆలోచన అంతా ఉంది. ఆమె ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి వారికి ఎలా న్యాయం చేయాలి అనే ఆలోచన నాకు ఉండేది అంటూ జగపతిబాబు చెప్పుకొచ్చారు