తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో నితిన్ ఒకరు. ఈయన జయం అనే
మూవీ తో హీరోగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని దక్కించుకొని
టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించినా నితిన్ ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఆఖరుగా ఈయన నటించిన రెండు సినిమాలు మాత్రం బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కొంత కాలం క్రితం ఈయన
మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఈ
సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆఖరుగా ఈయన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్
మూవీ తో ప్రేక్షకులను పలకరించగా ఈ
సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.