యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం విక్రమ్ 2022లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య నటించిన రోలెక్స్ పాత్ర కూడా బాగా క్లిక్ అయింది. ఇంకా చెప్పాలంటే ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకుంది. మాదకద్రవ్యాల గ్యాంగ్‌లీడర్‌గా సినిమా క్లైమాక్స్‌లో ఆయన పండించిన విలనిజంకు ప్రేక్షకులు స్టన్ అయిపోయారు.అయితే రోలెక్స్ పాత్ర ఆధారంగా ఒక ఫుల్ పక్కా యాక్షన్ మోడ్ సినిమాను తెరకెక్కిస్తానని లోకేశ్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా? అని సూర్య అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కేవీఎన్ సంస్థ రోలెక్స్ మూవీని భారీ స్థాయిలో నిర్మించబోతుంది. రోలెక్స్ అనే పాత్రకి ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అప్పట్లో విక్రమ్ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం కమల్ కంటే సూర్యనే తీసుకెళ్లాడు. అంటే విక్రమ్ కంటే రోలెక్స్ కే అంతటి హైప్ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని నెక్ట్స్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. నెక్ట్స్ ఖైదీ 2`ని రూపొందించే ఆలోచనలో లోకేష్ ఉన్నారట.ఇదిలావుండగా రెట్రో తర్వాత సూర్య .. ఆర్.జె.బాలాజీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో సూర్యకు జోడిగా త్రిష నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి పేటైక్కారన్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట.సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఆయన నటించిన రెట్రో సినిమా షూటింగ్ పూర్తయి, విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా, తన 2డి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నిర్మించారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది.