హరిహర వీరమల్లు : ఇంట్రెస్టింగ్ గా సెకండ్ సాంగ్ ప్రోమో..పవన్ లుక్స్ అదిరిపోయాయిగా..!!
హరి హర వీరమల్లులో ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మంచి ఊపున్న బీట్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. డ్యాన్స్ నంబర్‌గా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ పాటను మంగ్లి, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామినీ ఘంటశాల పాడారు. ప్రోమోలో మంగ్లీ వాయిస్ ఉంది. ఈ పాటకు చంద్రోబోస్ లిరిక్స్ అందించారు.ఇందులో భాగంగా ఇటీవలే ఫస్ట్ సింగిల్ 'మాట వినాలి' సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో పాటను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. సెకండ్ సింగిల్ 'కొల్లగొట్టినాదిరో' పాటను ఈనెల 24న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్, మంగ్లీ వాయిస్ తో పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది సాంగ్. ఫుల్ సాంగ్ 24న మధ్యాహ్నం 3గంటలకు రానుంది. ఈ పాటలో యాంకర్ అనసూయ స్పెషల్ అపియరెన్స్ గా కనిపించబోతుంది. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'హరిహర వీరమల్లు' 2025 మార్చి 28న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
Nidhhi Agerwal
-
chandra bose
-
chandrabose
-
hari
-
hari music
-
jyothi
-
m m keeravani
-
pujitha
-
raghu babu
-
ramya
-
ramya krishnan
-
Subhas Chandra Bose
-
Josh
-
Oscar
-
Mangli
-
Chitram
-
Kannada
-
anasuya bharadwaj
-
Anasuya
-
Pawan Kalyan
-
CM
-
Music
-
Andhra Pradesh
-
rahul
-
Rahul Sipligunj
-
March
-
February
-
Director
-
surya sivakumar
-
Cinema