వావ్: ఆ దేశంలో దేవర సినిమా రిలీజ్.. మళ్లీ అక్కడికి వెళ్ళనున్న ఎన్టీఆర్..!
ముఖ్యంగా జపాన్లో తెలుగు హీరోలకు కూడా భారీ క్రేజీ ఉన్నది.అందుకే మన సినిమాలను కూడా అక్కడ చాలా గ్రాండ్గా విడుదల చేస్తూ ఉంటారు. కొంతమంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరి సినిమాలను చూసి వెళ్లిన సంఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాము. సెలబ్రిటీలకు కూడా అక్కడికి వెళ్లి మరి ప్రమోషన్స్ ను చేస్తూ ఉంటారు.. జపాన్లో మార్చి 28వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎన్టీఆర్ స్వయంగా కూడా ప్రమోషన్స్ కి వెళ్ళబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకోసం ఎన్టీఆర్ జపాన్ మీడియాకు కూడా ఆన్లైన్లో పలు రకాల ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమికాలలో వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ మార్చి 22వ తేదీన జపాన్ కి వెళ్ళబోతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. గతంలో కూడా ఎన్టీఆర్ రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన rrr సినిమా ప్రమోషన్స్ కి కూడా జపాన్ కి వెళ్లారు. ఇప్పుడు మరొకసారి దేవర సినిమా అక్కడ రిలీజ్ కాబోతున్న సందర్భంగా జపాన్ కి వెళ్లి ప్రచారం చేయబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ రాబోతున్నారని విషయం తెలియగానే ఆనందంతో ఖుషి చేస్తున్నారట.