ప్రభాస్ టాలీవుడ్ హీరోనే కానీ అతని అభిమానం మాత్రం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్‌లో ఉంది. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే కోట్లు కొల్లగొట్టాల్సిందే. ప్రస్తుతం ఆయన బాక్సాఫీస్‌కు రారాజు. ఐదేళ్లగా ఆయన నటించిన ప్రతి చిత్రం తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. రెబల్‌స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బాక్సాఫీస్‌కు కింగ్‌గా నిలిచాడు. బాహుబలి నుంచి ఇప్పటి దాకా ఈ ఎనిమిదేళ్లలో ఆయన నటించిన ఏడు సినిమాలకు గానూ రూ.5300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.2015 నుంచి ప్రభాస్ నటించిన ప్రతి సినిమా రూ.500 నుంచి 1000 కోట్ల మధ్యలో వసూళ్లు రాబట్టాయి. కొన్ని అయితే రూ.900 కోట్లు క్రాస్ చేశాయి. ప్రభాస్ సినిమాలకు విడుదలకు ముందు విపరీతమైన బజ్ క్రియేట్ అవుతుంది. అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం ఆయన సినిమాల కోసం వెయిట్ చేస్తుంటారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. గడిచిన తొమ్మిదేళ్లలో కేవలం 7 సినిమాల్లోనే నటించాడు. అతని బాక్సాఫీస్ వాల్యూ మాత్రం రూ.5300 కోట్లు. భారతీయ సినిమాల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు.ఇదిలావుండగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రెండున్నర గంటల్లో సినిమా సాధ్యం కాదా? రెండు భాగాలుగా చెప్పాల్సిన కథని ఒక్క భాగంలో చెప్పలేరా? రెండున్నర గంటలకు బధులు మూడు గంటలు తీసుకున్నా సమయం సరిపోవడం లేదా అంటే ప్రస్తుతం సన్నివేశం అలాగేకనిపిస్తుంది. ప్రభాస్ 'బాహుబలి'తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.బాహుబలి' రాజులు..రాజ్యాలకు సంబంధించిన కథ కావడంతో? రాజమౌళి దాన్ని రెండు భాగాలు చేసి రిలీజ్ చేసాడు.
రెండిటా సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్',' ఆదిపురుష్' చిత్రాలు రిలీజ్ అయి ప్లాప్ అయ్యాయి. లేకపోతే వీటికి కంటున్యూటీ కథలు తెరపైకి వచ్చేవేమో. ఆ తర్వాత 'సలార్', 'కల్కి' కూడా రెండు భాగాలుగా వస్తున్నాయి. ఇప్పటికే వీటి మొదటి భాగాలు భారీ విజయం సాధించడంతో? రెండవ భాగం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవి భారీ స్పాన్ ఉన్న కథలు కావడంతో? రెండు భాగాలుగా చెప్ప డంలో అర్దం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న 'పౌజీ' కూడా రెండు భాగాలు రిలీజ్ అవుతుందనే ప్రచారంలో ఉంది.ఈ కథని ఒక్క భాగంలో చెప్పడానికి వీలున్నా అధిక బడ్జెట్ కారణంగా రెండు ముక్కలుగా చీల్చుతున్నట్లు సమాచారం. వ్యవ హారం చూస్తుంటే ప్రభాస్ తో ఏ ఒక్కరూ రెండున్నర గంటల సినిమా తీసేలా కనిపించలేదు. పాన్ ఇండియాలో డార్లింగ్ ఛరిష్మాతో కోట్ల వసూళ్లు రాబట్టొచ్చు అన్న స్ట్రాటజీతోనే మేకర్స్ ముందుకెళ్తున్నారు.ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. తదుపరి సలార్ 2, కల్కి -2 చిత్రాలతో బిజీ కానున్నారు. సందీప్‌రెడ్డి వంగాతో చేసే స్పిరిట్ కూడా త్వరలోనే సెట్స్ మీదకెళ్లనుందని తెలుస్తోంది.