
అంతరిక్షంలోకి వెళ్లబోతున్న స్టార్ సింగర్.. ఎవరో తెలుసా?
ఇక అసలు విషయంలోకి వెళితే... అంతరిక్షంలోకి తొలిసారిగా సింగర్ కేటి పెర్రి అడుగుపెట్టనున్నారు. ఆమెతో పాటుగా ఇద్దరు జర్నలిస్టులు అయినటువంటి లారెన్ సాంచెజ్, గేల్ కింగ్ అంతరిక్షయానం చేయనున్నారు. జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ అనే సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఈ ఏడాది మార్చి తర్వాత బ్లూ ఆరిజిన్ ఎన్ఎస్-31 మిషన్ ద్వారా మొత్తం 6 మంది మహిళా క్రూ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అంతరిక్షంలోకి జర్నలిస్టులు వెళ్లడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ లిస్టులో మొత్తం సింగర్ కేటి పెర్రి, అమెరికన్ ఏరో స్పేస్ ఇంజనీర్ ఐషా బోయీ, పౌర హక్కుల కార్యకర్త అమండా న్యూయెయిన్, అమెరికా ఫిల్మ్ ప్రొడ్యూసర్ కెరియానే ఫ్లైన్ ఉన్నారు.
కాగా, 1963లో రష్యా కాస్మోనాట్ వాలెంటీనా తెరిష్కోవా ఒంటరిగా స్పేస్‌లోకి ప్రయాణించిన సంగతి విదితమే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కేవలం మహిళలే అంతరిక్షంలోకి అడుగుపెట్టనుండటంతో సర్వత్రా హర్షాతిరేఖాలు వినిపిస్తున్నాయి. జెఫ్ బెజోస్ కాబోయే భార్య, మాజీ న్యూస్ కరస్పాండెంట్ లారెన్ సాంచెజ్ ఈ మిషన్‌కు నేతృత్వం వహించనున్నారు. బ్లూ ఆరిజిన్ రూపొందించిన న్యూ షెపర్డ్ రాకెట్ సబ్ ఆర్బిటల్ ప్రయాణాల కోసం ఉపయోగిస్తారు. ఇక వీరు అంతరిక్షానికి సరిహద్దుగా గుర్తింపు పొందిన కర్మాన్ రేఖపై నుంచి భూమిని వీక్షించడమే కాకుండా, దాదాపు 4 నిమిషాల పాటు గ్రావిటీ లేని స్థితిని అనుభవించే అవకాశం వీరికుంటుంది. ఇది న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్‌కు 11వ మానవ సహిత ప్రయోగంగా నిలవనుంది.