విక్టరీ
వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి
చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ...
అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ అదిరిపోయే రేంజ్
బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ
సినిమా మార్చి 1 వ తేదీన అనగా ఈ రోజు నుండి జీ 5 ఓ టి టి లో తెలుగు ,
తమిళ్ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇకపోతే ఈ
సినిమా ఎప్పుడెప్పుడు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే
తమిళ నటుడు
అజిత్ కుమార్ తాజాగా విడ మూయర్చి అనే సినిమాలో
హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో
త్రిష హీరోయిన్గా నటించింది. ఈ
మూవీ ని ఈ వారం తెలుగు ,
తమిళ్ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో
నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమాని తెలుగులో పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు. ఈ
మూవీ కి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాలేదు. ఇలా ఈ వారం
టాలీవుడ్ సీనియర్ స్టార్
హీరో వెంకటేష్ ,
కోలీవుడ్ సీనియర్ స్టార్
హీరో అజిత్ కుమార్ హీరోలుగా రూపొందిన సినిమాలు ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.