నందమూరి నటసింహం
బాలకృష్ణ గత కొంతకాలంగా వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు.. ఈ ఏడాది
బాలయ్య నటించిన లేటెస్ట్
మూవీ “డాకు మహారాజ్ “..సంక్రాంతి కానుకగా
జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. స్టార్
డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్
మూవీ ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి ఎంతగానో నచ్చజేసింది.. టోటల్ రన్ లో ఈ
సినిమా మంచి వసూళ్లు సైతం సాధించింది..అయితే అదే
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన
వెంకటేష్ “సంక్రాంతికి వస్తున్నాం”
బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో డాకు మహారాజ్ కలెక్షన్స్ పై కాస్త ఎఫెక్ట్ పడింది..
ఇదిలా ఉంటే ప్రస్తుతం
బాలయ్య,
బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గతంలో సూపర్ హిట్ అయిన ‘అఖండ’ సినిమాకి సీక్వెల్‌గా ‘అఖండ 2:
శివ తాండవం’ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.తాజా సమాచారం ప్రకారం.. ‘అఖండ 2’
మూవీ షూటింగ్ అప్డేట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది..మే చివరి నాటికి ఈ
సినిమా టాకీ పార్ట్ మాత్రమే కాకుండా సగం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా పూర్తి చేయాలని
బోయపాటి శ్రీను టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది..ప్రస్తుతం గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కించడం ట్రెండింగ్ గా మారింది..దీనితో ప్రేక్షకులలో ఆ సీక్వెల్ సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి...ఈ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా
బోయపాటి “అఖండ 2” సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో యంగ్
హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు..ఇప్పటికే
హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో
బాలకృష్ణ,
ఆది కాంబినేషన్‌లో
బోయపాటి కొన్ని కీలక సీన్స్‌ను కూడా షూట్ చేశారు..ఈ సినిమాను దర్శకుడు సరికొత్త లొకేషన్స్ లో తెరకెక్కిస్తున్నాడు.. అందులో భాగంగా మహాకుంభమేళా సమయంలో చిత్ర యూనిట్ రియల్ లొకేషన్స్‌లో కొన్ని సీన్స్ షూట్ చేసింది..తాజాగా ఈ
మూవీ టీం హిమాలయాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ‘అఖండ 2’
సినిమా షూటింగ్ కోసం కొన్ని కీలక లొకేషన్లను వెతుకుతున్నట్లు సమాచారం..ఈ
సినిమా ఫలితం బోయపాటికి ఎంతో కీలకం.దీనితో ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..