
ది ప్యారడైజ్ గ్లింప్స్..మాస్ లుక్ లో న్యాచురల్ స్టార్
ప్రస్తుతం నాని 'ది ప్యారడైజ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ మూవీని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో దసరా సినిమా వచ్చింది. ఇక దీంతో ది ప్యారడైజ్ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో సోనాలి కులకర్ణి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై రూపొందుతుంది. ది ప్యారడైజ్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ప్రకటించలేదు.
అయితే తాజాగా ఈ సినిమా గ్లింప్స్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో హీరో నాని మాస్ లుక్ లో కనిపించారు. ఇది చూసిన ప్రేక్షకులు ఈ సారి నాని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తారని అర్ధం అయింది. ఇక ఈ సినిమాలో నాని లుక్ ని చూసిన అభిమానులకు సినిమాపై ఆసక్తి పెరిగింది. నాని యాక్షన్ రోల్ లో రాబోయే ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనుందని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు.