2013లో హిట్టు... 2025లో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మ‌ళ్లీ హిట్టు..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


మన తెలుగు సినిమా దగ్గర వచ్చిన కొన్ని బ్యూటిఫుల్ మల్టీస్టారర్ సినిమాలు వ‌చ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ , ఏఎన్నార్ .. కృష్ణ త‌రంలో ఎన్నో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు వ‌చ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ఆ త‌ర్వాత త‌రం హీరోలు మ‌ల్టీస్టార‌ర్ సినిమా లు చేసేందుకు ఆస‌క్తి చూప‌లేదు. అయితే చిరు - బాల‌య్య - నాగ్ - వెంకీ త‌రం హీరో ల‌లో మ‌ల్టీస్టార‌ర్ సినిమా ల‌కు శ్రీకారం చుట్టిన ఘ‌న‌త వెంకీ దే. వెంకీ ప‌వ‌న్ , మ‌హేష్‌, రామ్ లాంటి హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేశాడు. వ‌రుణ్ తేజ్‌తోనూ క‌లిసి న‌టించాడు.


ఈ క్ర‌మంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు - విక్టరీ వెంకటేష్ లు హీరోలుగా సమంత , అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన అందమైన కుటుంబ కథా చిత్రం “ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ” . దిల్ రాజు నిర్మాణ సార‌థ్యం లో ద‌శాబ్దం క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు  థియేటర్స్ లో రీ రిలీజ్ అయ్యింది. అయితే అప్పుడు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు తనకి మంచి లాభాలు కూడా అందించింది అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.


ఇప్పుడు మ‌ళ్లీ రాజు మంచి ప్ర‌మోష‌న్లు చేయ‌డంతో తొలి రోజు రీ రిలీజ్ లో కూడా దుమ్ము రేపేసింది. హైద‌రాబాద్ లో అయితే రెండు థియేట‌ర్ల లో మూడు రోజుల టిక్కెట్లు ఇప్ప‌టికే బుక్ అయిపోయాయి. ఇలా మొత్తానికి రీ రిలీజ్ లో కూడా ఈ మల్టీస్టారర్ మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా మణిశర్మ నేపథ్య సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: