టాలీవుడ్
యువ నటుడు
కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలలో
హీరో గా నటించి అందు లో కొన్ని
మూవీ లతో మంచి విజయాలను కూడా అందుకున్నాడు . ఆఖరుగా ఈ నటుడు "క" అనే సినిమాలో
హీరో గా నటించాడు . మంచి అంచనాల నడుమ విడుదల ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్
సక్సెస్ అయింది. ఈ
మూవీ తో
కిరణ్ కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
యువ నటుడు దిల్రుబా అనే సినిమాలో
హీరో గా నటించాడు.
ఈ
మూవీ ని
మార్చి 14 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని ఏరియాల
థియేటర్ హక్కులను ఈ
మూవీ బృందం వారు అమ్మివేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ
మూవీ యొక్క నైజాం ఏరియా
థియేటర్ హక్కులను మైత్రి సంస్థ వారు దక్కించుకున్నారు.
ఈ విషయాన్ని ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇకపోతే మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. "క" లాంటి మంచి విజయవంతమైన
సినిమా తర్వాత
కిరణ్ నుండి వస్తున్న
మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొని ఉన్నాయి. మరి ఈ
మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.