సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం డైరెక్టర్ గా రానిస్తున్నాడు. తీసింది ఒకే ఒక్క సినిమా అయినా దసరా పాన్ ఇండియా లెవల్ లో అభిమానులను సంపాదించుకుంది. నాని హీరోగా వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఎంతో మంది ఫిదా అయ్యారు. సినిమా కథ వినడానికి హార్డ్ గా ఉన్నా ఇలాంటి కథలతోనే వచ్చిన తమిళ, మలయాళ చిత్రాలు ప్రశంసలు అందుకున్నాయి. కాబట్టి ఈ సినిమాను కూడా చాలా మంది ప్రశంసించారు. ఇప్పటికే నానితో ఓదెల మరో సినిమా కూడా మొదలుపెట్టాడు. అదే ది ప్యారడైజ్.. ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయగా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉందంటూ ప్రశంసలు అందుతున్నాయి.
ఈ సినిమాలో నాని కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో రెండు జెడలతో కనిపిస్తున్నాడు. చరిత్రలో చిలుకలు, పావురాల గురించే కథలు రాశారని ఇది కాకుల కథ అంటూ ఇంట్రెస్టింగ్ డైలాగులతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఓదెల మరో ఇంట్రెస్టింగ్ లైనప్ తో మరో సినిమాను ప్రకటించాడు. అయితే ఈ సినిమాకు ఓదెల కథను అందించడంతో పాటూ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చిత్రానికి చేతన్ బండి దర్శకత్వం వహిస్తున్నాడు. తాాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ ను సైతం విడుదల చేశారు.
దసరా సినిమాను గోదావరిఖని కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ యాసలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను కూడా అదే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. సినిమా టైటిల్ గులాబీ కాగా గోదావరఖని బొగ్గుగనుల్లో 2009లో జరిగిన ఓ హార్డ్ హిట్టింగ్ రియల్ ప్రేమ కథను బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. పోస్టర్ డిఫరెంట్ గా ఉండటంతో పాటూ ఓ మహిళ బ్లాక్ చీరలో నడుస్తుండగా ఆమె వెనక గులాబీ పూలు పడిపోయి కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. నటీనటుల వివరాలు కూడా ప్రకటించబోతున్నట్టు తెలిపారు.