తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తున్న వారిలో తెలుగు అమ్మాయిల సంఖ్య అత్యంత తక్కువ గానే ఉంటూ వస్తుంది. ఇక కొంత మంది తెలుగు అమ్మాయిలు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో సక్సెస్ అయిన వారి సంఖ్య మరి కాస్త తక్కువ గానే ఉంటుంది. ఇక తెలుగమ్మాయి అయి ఉండి కూడా చాలా సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకోవడంలో చాలా వరకు వెనక పడిపోయిన బ్యూటీలలో ప్రియాంక జవాల్కర్ ఒకరు.
ఈ ముద్దు గుమ్మ చాలా కాలం క్రితం నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందిన టాక్సీవాలా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇకపోతే కొంత కాలం ఈ బ్యూటీ తిమ్మరుసు , ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు మూవీ లు ఒకే రోజు విడుదల అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. కొంత కాలం క్రితం ఈ నటి టిల్లు స్క్వేర్ మూవీ లో ఓక కీలకమైన పాత్రలో నటించింది. ఇలా ఈమె నటించిన సినిమాలలో చాలా సినిమాలో మంచి విజయాలను అందుకున్నాయి.
కానీ ఈమె చేతిలో క్రేజీ సినిమాలు మాత్రం లేవు. ఇది ఇలా ఉంటే అవకాశం దొరికినప్పుడల్లా సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా వరకు యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.