
నా ఫస్ట్ లవ్ నాగచైతన్య కాదు, అతని కోసం చాలా చేశా.. శోభీత షాకింగ్ కామెంట్స్
ఇక తాజాగా ఈమె పాత వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో శోభిత తన ఫస్ట్ లవ్ గురించి చెప్పింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్నప్పుడు స్కూల్ లో తాను ఒక అబ్బాయిని చాలా ఇష్టపడిందని చెప్పుకొచ్చింది. కానీ ఆ వెధవ సన్నాసి తనని ఎప్పుడు పట్టించుకోలేదని తెలిపింది. ఈమె ఎంత ప్రయత్నించిన అతను అసలు పట్టించుకునేవాడు కాదని చెప్పింది.
అతడి ప్రవర్తన చూసి తనకు బాధేసేదని అంది. అప్పుడు అతని కోసం వ్యాసరచన వంటి కొన్ని అంశాలపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టిందని చెప్పింది. అందులో టాప్ వస్తే అయిన ఆ అబ్బాయి చూస్తాడాని అనుకునేదంట.. కానీ అయితే అప్పుడు కూడా అసలు పట్టించుకోలేదని తెలిపింది. అలా ప్రయత్నం చేసి అదే క్రమంలో తాను చాలా మారిపోయిందంట. తాను కూడా ఇంకా అతడి గురించి పట్టించుకోవడం మానేసింది అంట. కాలేజీలో కూడా తనకి చాలా లవ్ ప్రపోజల్స్ వచ్చేవని.. అలాగే తాను కూడా కొన్ని లవ్ లెటర్స్ రాసేదని చెప్పుకొచ్చింది. కానీ తనకి అబ్బాయిల విషయంలో అసలు టెస్ట్ యే ఉండేది కాదని తెలిపింది. ఇక ఈ వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది.