సల్మాన్, షారుఖ్ చనిపోయేది ఆరోజే..డేట్ తో సహా జోస్యం చెప్పిన బాలీవుడ్ వేణు స్వామి.?

frame సల్మాన్, షారుఖ్ చనిపోయేది ఆరోజే..డేట్ తో సహా జోస్యం చెప్పిన బాలీవుడ్ వేణు స్వామి.?

Pandrala Sravanthi
ఎవరైనా స్వామీజీలు, బాబాలు వాళ్ళు చెప్పిన ఏ ఒక్క విషయం కరెక్ట్ అయినా సరే దాని ద్వారా పాపులారిటీ సంపాదించి మరిన్ని విషయాలు లేనిపోనివి కలిగించి చెబుతూ ఉంటారు.అయితే చాలా రోజుల నుండి మన సౌత్ ఇండస్ట్రీలో వేణు స్వామి ఎంత ఫేమస్ అయ్యారో చెప్పనక్కర్లేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. బాలీవుడ్ లో కూడా వేణు స్వామి లాగే అచ్చం మరో స్వామీజీ తయారయ్యారు అంటూ సోషల్ మీడియాలో ఒక మ్యాటర్ వినిపిస్తోంది. అంతేకాదు ఆయన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లు ఎప్పుడు చనిపోతారో కూడా ఇయర్ తో సహా బయటపెట్టారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ఆయన ఎవరంటే సుశీల్ కుమార్ సింగ్.. ఈయన సిద్ధార్థ కణ్ణన్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో షారుఖ్ ఖాన్ సల్మాన్లకి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది అని ప్రశ్నించగా..
ఈ ఏడాది సల్మాన్ కి అస్సలు బాలేదు.షారుక్ ఖాన్ కి బాగుంది. సల్మాన్ కి వచ్చే మూడు సంవత్సరాలు కూడా టైం అస్సలు బాలేదు. ఇక వీరిద్దరి మధ్య ఉన్న పోలిక ఏంటంటే.. వీరిద్దరూ ఒకే ఇయర్లో చనిపోతారు. అది కూడా 67 ఏళ్ల వయసు వచ్చిన సమయంలో. ఇక సల్మాన్ ఖాన్ కి చెప్పుకోలేని పెద్ద వ్యాధి ఉంది. ఆ వ్యాధి గురించి కూడా నేను ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు.అయితే సల్మాన్ ఖాన్ కి ఉన్న ఆ జబ్బు కారణంగా చివరి రోజుల్లో ఎన్నో దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన చివరి రోజులు చాలా కఠినంగా ఉంటాయి అంటూ ఆ ఇంటర్వ్యూలో సుశీల్ కుమార్ సింగ్ చెప్పుకొచ్చారు. అయితే ఈయన ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. '
గతంలో నేను సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరుగుతుందని ముందే చెప్పాను.నేను చెప్పినట్టుగానే సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. అలాగే కరీనాకపూర్ సైఫ్ అలీఖాన్ లు విడాకులు కూడా తీసుకుంటారు. 2010లోనే సైఫ్ అలీఖాన్ పై దాడి జరుగుతుంది..కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ లు విడిపోతారని చెప్పాను. వీరు మరో ఏడాదిన్నర సమయంలో విడాకులు తీసుకుంటారు అంటూ షాకింగ్ విషయాలు తెలిపారు సుశీల్ కుమార్ సింగ్. ప్రస్తుతం ఈయన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో ఈ హీరోల అభిమానులు సుశీల్ కుమార్ సింగ్ పై మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: