శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ 2013 జనవరి 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కుటుంబకథా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ కూడా భారీ అంచనాలతో వస్తాయి. అలా ఈ సినిమాకి కూడా మంచి టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి.అలా శ్రీకాంత్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో హీరోలుగా వెంకటేష్,మహేష్ బాబులు నటించారు. అలాగే సమంత, అంజలిలు హీరోయిన్స్ గా చేశారు.ఇక ఈ మూవీలో ప్రకాష్ రాజ్, జయసుధ, అభినయ,రావు రమేష్, మురళీమోహన్ వంటి ఎంతోమంది కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా వెంకటేష్ చేయాల్సింది కాదని, ఆ హీరోతో అనుకున్నా అంటూ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు.
ఆయన మాట్లాడుతూ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ టైటిల్ అనుకోకముందు మల్టీ స్టారర్ చేయాలనుకున్నాను. అయితే ఈ సినిమాలో హీరోగా నాగార్జున అయితే బాగుంటుందని నిర్ణయించుకున్నాను. ఇక నేను అనుకున్నదే తడవగా వెంటనే నాకు మార్తాండ్.కే. వెంకటేష్ నుండి ఫోన్ వచ్చింది..మిమ్మల్ని నాగార్జున కలవాలనుకుంటున్నారు ఆయనతో మీరు ఏదైనా సినిమా చేస్తారా అని అడిగారు. సరే నా దగ్గర ఓ స్టోరీ ఉంది అని చెప్పాను. ఆ వెంటనే నాగార్జున ను కలిసి స్టోరీ చెప్పగా మల్టీస్టారర్ అని తెలియడంతో సరే చూద్దాం అని అన్నారు.
అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు మార్తాండ్.కే.వెంకటేష్ మళ్ళీ కాల్ చేసి సురేష్ బాబు రమ్మంటున్నారని చెప్పడంతో నేను వెంటనే సురేష్ బాబు,వెంకటేష్ లని కలవడానికి వెళ్లాను. అయితే వీరికి కూడా నాగార్జునకి చెప్పిన స్టోరీనే చెప్పాను. మల్టీస్టారర్ మూవీ అని,అన్నదమ్ముల నేపథ్యంలో సాగుతుంది అని చెప్పడంతో స్టోరీ లైన్ బాగుంది.దీని స్క్రిప్ట్ వర్క్ రెడీ చేయండి సినిమా చేద్దాం అని వెంకటేష్ చెప్పారు.దాంతో నాగార్జునతో అనుకున్న సినిమా వెంకటేష్ ని పెట్టి తీయాల్సి వచ్చింది. అలా వెంకటేష్ మహేష్ బాబు కాంబోలో ఈ సినిమా వచ్చింది అంటూ శ్రీకాంత్ అడ్డాల రీసెంట్గా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీ రిలీజ్ అయిన టైంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయాన్ని బయటపెట్టారు.