ఏంటి పూరి జగన్నాథ్ ఛార్మితో నిజంగానే గొడవలు పెట్టుకున్నారా.. హీరోయిన్ కి నిజంగానే బ్రేకప్ చెప్పారా..ఇన్ని రోజుల వీరి మధ్య ఉన్న బంధాన్ని ఒక్క మాటతో తెగదింపులు చేసుకున్నారా.. ఇంతకీ పూరి జగన్నాథ్,ఛార్మి కౌర్ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు అనే వార్తల్లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే పెళ్లయి పిల్లలు పుట్టి పెళ్ళీడుకి పిల్లలు ఎదిగినా కూడా పూరి జగన్నాథ్ తన భార్యను పక్కన పెట్టి హీరోయిన్ ఛార్మితో డేటింగ్ చేస్తున్నారు అనే వార్తలు చాలా రోజుల నుండి వినిపిస్తున్నాయి.అంతేకాదు పూరి జగన్నాథ్ లావణ్య మధ్యలో ఛార్మి వల్ల ఎన్నో గొడవలు వచ్చాయని, విడాకులు కూడా తీసుకోబోతున్నారని రూమర్లు వినిపించాయి.
అయితే ఇప్పటివరకు విడాకులు అయితే తీసుకోలేదు కానీ ఛార్మి ప్రతిసారి పూరి జగన్నాథ్ తో కలిసి కనిపిస్తూ వారిద్దరి మధ్య నిజంగానే ఎఫైర్ ఉందనే అనుమానాలు పుట్టిస్తుంది. అయితే మొదట ఛార్మి దేవిశ్రీప్రసాద్ ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ ఎప్పుడైతే పూరి జగన్నాధ్ తో ఛార్మి తిరగడం మొదలుపెట్టిందో అప్పటినుండి ఛార్మికి డిఎస్పి కి మధ్య ఉన్న బంధం తెగిపోయి బ్రేకప్ జరిగిందనే రూమర్స్ కూడా వినిపించాయి. ఇక ఛార్మి వాళ్ళనే డీఎస్పీ ఇంకా పెళ్లి కూడా చేసుకోవడంలేదని టాక్.ఈ విషయం పక్కన పెడితే పూరి జగన్నాధ్ చేసే ప్రతి సినిమాకి నిర్మాతగా..సహనిర్మాతగా.. ఛార్మి వర్క్ చేస్తుంది. కానీ ప్రస్తుతం పూరి జగన్నాథ్ వరుస ప్లాఫ్ లతో ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఓ మూడు నాలుగు కథలను రెడీగా పెట్టుకొని స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి పూరి జగన్నాథ్ వెయిట్ చేస్తున్నారట.
అయితే కొంతమంది పూరి జగన్నాథ్ సన్నిహితులు నువ్వు నీ నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలంటే అనవసరమైనవన్నీ వదిలిపెట్టుకోవాలి అని, పూర్తిగా నీ డైరెక్షన్, కథ,స్క్రిప్ట్ మీదనే దృష్టి సారించాలి అని చెప్పారట. దీంతో పూరి జగన్నాథ్ ఛార్మితో గొడవపడ్డారట.నీ వల్లే నాకు ఒక్క హిట్ కూడా దొరకడం లేదని, అసలు సినిమాలపై దృష్టి కూడా పెట్టడం లేదని గొడవలు పడి చివరికి ఛార్మికి బ్రేకప్ చెప్పినట్టు టాలీవుడ్ సీనీ సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ మరి కొంతమందేమో ఈ బ్రేకప్ వార్తలు అవాస్తవమని, పూరి జగన్నాథ్ నెక్స్ట్ మూవీకి కూడా ఛార్మి సహనిర్మాతగా చేస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. మరి ఛార్మి పూరీల బ్రేకప్ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది