
పెళ్లి పై అలాంటి వ్యాఖ్యలు చేసిన మీనాక్షి చౌదరి.. అబ్బో అంటున్న ఫ్యాన్స్..!
తమిళంలో కూడా పలు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ క్రేజ్ పెరిగిపోయింది. అటు రెండు భాషలలో కూడా అవకాశాలను అందుకుంటున్న మీనాక్షి చౌదరి.. తన పెళ్లి గురించి ఒక క్రేజీ న్యూస్ అయితే వెల్లడించింది. తనకు కావాల్సిన భర్త ఎలా ఉండాలో పలు రకాల విషయాలను తెలియజేసింది.. తనకు కాబోయే వారు అచ్చం తనలాగే ఉండాలని తన లాంటి స్వభావం కలిగిన వ్యక్తి దొరికితే ఖచ్చితంగా వివాహం చేసుకుంటానని వెల్లడించింది.
తన కాబోయే వరుడుకి మంచి గుణం ఉండాలని.. తనని బాగా చూసుకోవాలని అందుకోసం చాలా కలలు కంటున్నాను అంటూ తెలియజేసింది. ఈ విషయం విన్న అభిమానులు సైతం పెళ్లి పైన మీనాక్షికి బాగానే కోరికలు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిరంతరం సోషల్ మీడియాలోనే ఆక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోషూట్లను కూడా షేర్ చేస్తూ హైలెట్ గా ఉంటుంది. తెలుగులో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాని కూడా ఇంకా ప్రకటించలేదు. తన తదుపరిచిత్రం కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి మీనాక్షి చౌదరి పెళ్లిపైన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరొకసారి వైరల్ అవుతున్నాయి.