
హీరోలనే గడగడలాడించిన సూర్యకాంతం.. భయపెట్టింది ఎవరంటే..?
అలా సినిమాల మీద ఇష్టంతో తన తల్లిని తోడుగా తీసుకొని మద్రాస్ కు వెళ్ళిందట. అలా 1946లో నారదానారది అనే చిత్రంలో మొదటిసారి నటించిందట సూర్యకాంతం. అయితే 1962 లో రిలీజ్ అయిన గుండమ్మ కథ సినిమాతో ఈమె కెరియర్ మారిపోయింది. అలాంటి సమయంలోనే హైకోర్టు జడ్జి చలపతిరావును 1950లో పెళ్లి చేసుకుందట. సూర్యకాంతం చివరిగా ఎస్పీ పరశురాం చిత్రంలో నటించింది. సూర్యకాంతం వెండితెర పైన గయ్యాళి అత్తగా పేరుపొందిన తన రియల్ లైఫ్ లో మాత్రం చాలా హుందాగా ఉండేదట.
ఒక చిత్రంలో చిత్తూరు నాగయ్యను తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సన్నివేశంలో ఆమె ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పి నటించిందట. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర హీరోలతో నటించిన గుండమ్మ కథ అనే టైటిల్ ని పెట్టి విజయం సాధించడం అంటే అంత ఆషామాసి విషయం కాదట. సూర్యకాంతం వల్లే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నదట. అయితే ఒకానొక సమయంలో సూర్యకాంతం కారులో పోతూ ఉంటే ఒక గ్రామం దగ్గర ఒక మహిళ నిలబెట్టి.. సూర్యకాంతం దగ్గరకు వచ్చి ఏం తల్లి సినిమాలలో ఎంతమంది కాపురాలను కూల్చుతూ ఉంటావు... ఎంతమందిని విడగొడతావు నీకు పని లేదా హాయిగా కారులో తిరుగుతున్నావు అంటూ ప్రశ్నించడంతో ఆశ్చర్యపోయిందట.. ఎంతమంది ఉసురుపోసుకుంటావంటూ ఆ మహిళ తిట్టడంతో కొంతమేరకు సూర్యకాంతం భయపడి పోయిందట.