ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోయిన సంవత్సరం చివరన పుష్ప పార్ట్ 2 అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. పుష్ప పార్ట్ 2 సినిమా విడుదలకు ముందు వరకు అల్లు అర్జున్ తన తదుపరి మూవీ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసే అవకాశాలు ఉన్నాయి అని బలంగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
బన్నీ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నట్లు ఆ తర్వాత అట్లీ తో మూవీ చేయబోతున్నట్లు వార్తలు బలంగా రావడంతో జనాలు కూడా అల్లు అర్జున్ లైనప్ ఇలానే ఉంటుంది అని అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తన లేనప్ ను పూర్తిగా మార్చి వేసినట్లు తెలుస్తోంది. మొదట బన్నీ , అట్లీతో సినిమా చేయనున్నట్లు అది పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అట్లే ఇప్పటికే బన్నీ సినిమా కోసం పూర్తి కథను రెడీ చేసినట్లు దానితో అట్లీతో సంవత్సరంలో సినిమా చేయాలి అని ఒప్పందం కుదుర్చుకొని బన్నీ , అట్లీతో సినిమా కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ , అల్లు అర్జున్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకే చాలా సమయాన్ని కేటాయించబోతున్నట్లు అలా త్రివిక్రమ్ , బన్నీ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా పూర్తి చేసుకునే లోపు అట్లీతో ఓ మూవీ కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో బన్నీ తన నెక్స్ట్ మూవీ ని అట్లీతో కమిట్ అయినట్లు తెలుస్తోంది.
ఇకపోతే అట్లుకి సంవత్సరం లోపు సినిమాను కంప్లీట్ చేయాలి అనే కండిషన్ ను కూడా బన్నీ పెట్టినట్లు ఆ కండిషన్ కి తగినట్లుగానే సంవత్సరంలో బన్నీ తో అట్లీ సినిమాను కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.