SVSC సినిమాలో.. వెంకటేష్ కాదు ఆ హీరో చేయాల్సిందట తెలుసా?

frame SVSC సినిమాలో.. వెంకటేష్ కాదు ఆ హీరో చేయాల్సిందట తెలుసా?

praveen
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"... టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే మల్టీస్టారర్ మూవీ ఇది. 2013 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రీసెంట్ గా, ఈ నెల 7న మళ్ళీ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా మొదలైనప్పటి సంగతులు చెప్పారు.
శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ వెంకటేష్ తో ఈ సినిమా ఫైనల్ అయ్యే ముందు, ముందుగా టాలీవుడ్ కింగ్, మన్మథుడు నాగార్జునకు ఈ కథ చెప్పారట. సినిమా స్టార్టింగ్ స్టేజ్ లో ఏం జరిగిందో ఆయన మాటల్లోనే విందాం.
"ఒకరోజు నేను ఊరికి వెళ్తుంటే, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ నాకు ఫోన్ చేశారు. 'నాగార్జునతో సినిమా చేసేలా ఏమైనా స్టోరీ ఉందా?' అని అడిగారు. అప్పటికి నేను ఒక్క సినిమానే చేశాను. 'కొత్త బంగారు లోకం'. అందులో చిన్న నటుడు హీరోగా నటించాడు. అంటే నేను చాలా చిన్న నటుడితో మాత్రమే సినిమా చేసిన అనుభవం ఉంది. అలాంటి అనుభవం ఉన్నప్పుడు ఏకంగా నాగార్జునతో సినిమా చేస్తావా అని అడిగేసరికి నాకు కాస్త నెర్వస్ గా అనిపించింది. అందుకే 'సరే సార్, చూసి చెప్తాను' అని చెప్పాను."
"నాకు ఇద్దరు అన్నదమ్ముల గురించి సినిమా తీయాలని ఎప్పటినుంచో ఉంది. హైదరాబాద్ రాగానే నాగార్జునను కలిసి ఈ ఐడియా చెప్పాను. ఇది మల్టీస్టారర్ సినిమా అని చెప్పాను, కానీ స్క్రిప్ట్ ఇంకా రెడీగా లేదు అని కూడా చెప్పాను. ఆయన సింపుల్ గా 'చూద్దాం' అన్నారు."
"అదే టైమ్ లో మళ్లీ మార్తాండ్ గారు ఫోన్ చేసి, నిర్మాత సురేష్ బాబు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని చెప్పారు. నేను వెంటనే సురేష్ బాబు గారిని కలిశాను. అక్కడ వెంకటేష్ కూడా ఉన్నారు. అన్నదమ్ముల స్టోరీ ఐడియా వాళ్లకి కూడా చెప్పాను. వాళ్లకి కాన్సెప్ట్ బాగా నచ్చింది. స్క్రిప్ట్ రెడీ చేయమన్నారు."
"నేను నా రెండో సినిమా దిల్ రాజు బ్యానర్ లో చేస్తానని వాళ్లకి చెప్పాను. వాళ్లు కూడా ఓకే అన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ వెంకటేష్ దగ్గరికి వచ్చింది" అని శ్రీకాంత్ అడ్డాల వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: