వావ్: చరిత్ర సృష్టించిన బాలయ్య బ్యూటీ.. ఏకంగా 12 కోట్లు పెట్టి..?

frame వావ్: చరిత్ర సృష్టించిన బాలయ్య బ్యూటీ.. ఏకంగా 12 కోట్లు పెట్టి..?

Divya
సినీ సెలబ్రిటీలు ఏదైనా లగ్జరీ కార్లు, బంగ్లాలు కొన్నారంటే చాలు వాటికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. చాలామంది సంపాదించే స్థాయిని బట్టి వారు వస్తువులను కొంటూ ఉంటారు. అయితే ఎంతో మంది హీరోలు 100 కోట్ల రూపాయలు అందుకుంటూ ఉంటారు. వీరు రోల్స్ రాయిస్ కారుని నడపడం మనం చూసే ఉన్నాము. కానీ స్పెషల్ సాంగ్ లలో చిన్న చిన్న పాత్రలలో సరిపెట్టుకున్న ఊర్వశి రౌతేలా ఏకంగా 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోల్స్ రాయల్స్ కారుని కొనుగోలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందట.
ఇటీవలే డాకు మహారాజు చిత్రంలో దబిడి దిబిడి అనే పాటతో దేశవ్యాప్తంగా ఈమె క్రేజ్ పెరిగింది. బాలయ్య సమక్షంలో బోల్డ్ స్టెప్పులు వేయడంతో ఈమె పేరు మరింత వైరల్ గా మారింది. దీనిపైన ఎన్నో చర్చలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. శేఖర్ మాస్టర్ తో కలిసి ప్రతిదీ ప్లాన్గా చిత్రీకరించినప్పటికీ డాన్స్ పైన చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఈ పాట కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నదట ఊర్వశి. అయితే ఇప్పుడు తాజాగా 12 కోట్ల రూపాయలు విలువైన రోల్స్ రాయల్స్  కారుని కొనుగోలు చేసిన  మొట్టమొదటి నటిగా ఊర్వశి రౌతెలా ఒక చరిత్రను సృష్టించినది.

ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పోర్చు రిచ్ లిస్టులో కూడా చేరడం జరిగిందట. అయితే దీంతో చాలామంది ఈమెకు ఇంత పెద్ద ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది కేవలం ఏడాదికి రెండు మూడు చిత్రాలు నటిస్తూ ఉన్నది. అలా వేసుకున్న కూడా 8 కోట్ల రూపాయల వరకు ఈమె ఆదాయం తగ్గదు అంటూ  పలువురు నేటీజన్స్ తెలియజేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో కూడా పోస్టులతో భారీగా ఆదాయం సంపాదిస్తూ పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ వంటి వాటి ద్వారా భారీగానే ఆదాయం సంపాదిస్తున్నదట. మొత్తానికి బాలయ్య బ్యూటీ ఒక చరిత్రని సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: