
ప్రియదర్శి కోర్ట్ మూవీ రివ్యూ.. న్యాచురల్ స్టార్ నిర్మాతగా బ్లాక్ బస్టర్ సాధించారా?
కథ :
చందు (రోషన్) ఇంటర్ ఫెయిల్ కావడంతో పార్ట్ టైమ్ గా చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు. అయితే చందు వయస్సు 19 సంవత్సరాలు కాగా 17 సంవత్సరాల వయస్సు ఉన్న జాబిలి(శ్రీదేవి), చందు మధ్య ప్రేమ పుడుతుంది. పరువు, ప్రతిష్టలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే మంగపతి(శివాజీ)కి చందూ, జాబిలి మధ్య ప్రేమ విషయం తెలుస్తుంది. చందూపై పగ పెంచుకున్న మంగపతి చందూపై పోక్సో చట్టం, ఇతర కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తాడు.
ఏ తప్పు చేయని చందూకు న్యాయం జరిగిందా? పేరు మోసిన లాయర్ మోహన్ రావు (సాయికుమార్) చందూ విషయంలోన్ చేసిన తప్పేంటి? జూనియర్ లాయర్ సూర్యతేజ(ప్రియదర్శి) చందూకు న్యాయం జరగడం కోసం ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ : ఈ మధ్య కాలంలో కోర్ట్ రూమ్ కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తున్నాయి. వకీల్ సాబ్, నాంది సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు కలెక్షన్ల విషయంలో అదరగొట్టాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చట్టం గురించి తెలియాలనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఫస్టాఫ్ లవ్ స్టోరీతో సాగగా ఇంటర్వెల్ తర్వాత కోర్ట్ రూమ్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి.
రోషన్, శ్రీదేవి తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. సూర్యతేజ రోల్ లో ప్రియదర్శి అదరగొట్టగా శివాజీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. సాయికుమార్ ఒక సీన్ లో అద్భుతమైన నటన కనబరిచారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, బీజీఎం బాగుంది. రామ్ జగదీష్ తన డైరెక్షన్ లో తెరకెక్కిన తొలి సినిమా అయినా పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. నాని ఈ సినిమాతో నిర్మాతగా సక్సెస్ సాధించినట్టేనని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్ : ఫస్టాఫ్, కథ, కథనం, మ్యూజిక్
మైనస్ పాయింట్స్ : లాజిక్ లేని కొన్ని సీన్స్, కొన్ని బోరింగ్ సన్నివేశాలు
రేటింగ్ : 2.75/5.0