కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య ఆఖరుగా కాంగువ అనే సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ప్రస్తుతం సూర్య , కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న రెట్రో అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే , సూర్య కి జోడిగా కనిపించబోతుంది. ఈ మూవీ ని మరి కొంత కాలం లోనే విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాతో పాటు సూర్య , ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న మరో మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు.
ఇలా రెండు మూవీ లతో ఫుల్ బిజీగా ఉన్న సూర్య మరికొన్ని మూవీ లకి కూడా ఇప్పటికే కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూర్య , వేట్రీ మారన్ దర్శకత్వంలో ఓ మూవీకి కూడా కమిట్ అయ్యాడు. అలాగే నేరుగా ఓ తెలుగు సినిమాలో కూడా సూర్య నటించబోతున్నట్లు తెలుస్తోంది. సూర్య తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకీ అట్లూరి , సూర్య సినిమాకు సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వెంకీ అట్లూరి ఇప్పటికే సూర్య సినిమాకు సంబంధించిన ఇద్దరు హీరోలను కూడా ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
సూర్య తో వెంకీ అట్లూరి చేయబోయే సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు , అందులో భాగంగా మేకర్స్ నిధి అగర్వాల్ , భాగ్య శ్రీ బోర్స్ ను హీరోయిన్లుగా తీసుకోవాలి అని ఆలోచనలో ఉన్నట్లు అందులో భాగంగా ఈ ఇద్దరు బ్యూటీలతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు అన్ని ఓకే అయితే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు సూర్య , వెంకీ అట్లూరి కాంబోలో రూపొందబోయే సినిమాలో హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు అవుతుంది.