అనసూయ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలిసిపోయిందిగా .. ఇంత అందం అందుకేనా..!

frame అనసూయ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలిసిపోయిందిగా .. ఇంత అందం అందుకేనా..!

Amruth kumar
తెలుగు హాట్ యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ క్రేజ్ ను తెచ్చుకుంది .. టీవీ షోలో తనకంటూ ప్రత్యేక మార్క్ ను క్రియేట్ చేసుకుంది అనసూయ  .. తన అందం వయ్యారాలతో యువతను కట్టిపడేస్తుంది .. ఈ బ్యూటీ సినిమాల్లోనూ నటిస్తూ అదరగొడుతుంది .. రంగస్థలం సినిమాతో అనసూయ డిమాండ్ భారీగా పెరిగింది .. ఈ సినిమాలో రంగమ్మత్తగా ఆమె చేసిన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది .. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది .

ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీ షోలో కూడా నటిస్తూ ఆకట్టుకుంటుంది అనసూయ .. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటుంది ఈ హాట్ బ్యూటీ .. తన సినిమాల, షోల‌ అప్డేట్స్ తో పాటు తన అందమైన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ .. అనసూయ సోషల్ మీడియాలో పెట్టె హాట్ ఫోటోలకు  భారీ డిమాండ్ ఉంది .. ఎప్పుడు ఫోటోలు పెట్టిన అవి నిమిషాల్లో వైరల్ గా మారుతాయి. అలాగే ఈ హాట్ యాంకరమ్మ  పై భారీగానే ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి .. ఇక వాటిపై ఈమె గట్టిగానే రియాట్ అవుతూ ఉంటుంది .. తనపై ఎవరైనా బ్యాడ్ కామెంట్ చేసిన పిచ్చిపిచ్చి పోస్టులు పెట్టిన వారిపై ఓ రేంజ్ లో విడుచుకుపడుతుంది అనసూయ .. అలాగే సమాజంలో జరిగే అనేక విషయాల గురించి కూడా ఈమె స్పందిస్తూ ఉంటుంది .

అయితే తాజాగా అనసూయ షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది .. ఇక ఆ వీడియోలో అనసూయ వర్కర్స్ చేస్తూ కనిపిస్తుంది .. ఇదే అనసూయ అందానికి వయ్యారానికి కారణం అంటూ అభిమానులు నెటిజ‌న్లు ఆ వీడియోకు కామెంట్లు చేస్తున్నారు .. అలాగే ఆ వీడియోలో అనసూయ ఇంటి ముందు ముగ్గు వేయటం కూడా చూడొచ్చు .. పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అనసూయ అందం ఎక్కడ ఏమాత్రం తగ్గలేదు .. ఇప్పటికీ ఈ బ్యూటీ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది .. ఇప్పటికే పుష్ప 2 సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది  .. అలాగే ప‌లు సినిమాల్లోను ఈ బ్యూటీ నటిస్తుంది .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: