తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఈయన జోష్ మూవీ తో కెరియర్ ను మొదలు పెట్టి మొదటి సినిమాతో అపజయాన్ని ఎదుర్కొన్న ఆ తర్వాత ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. తాజాగా నాగ చైతన్య , చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన తండెల్ అనే సినిమాలో హీరో గా నటించాడు.
ఈ మూవీ లో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా ... బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 7 వ తేదీన తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇకపోతే ఈ సినిమాకి నెట్ ఫ్లిక్స్ లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి సంస్థ వారు తండెల్ సినిమా ట్రెండింగ్ నెంబర్ వన్ లో కొనసాగుతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇలా ఈ సినిమా థియేటర్లలో మాత్రమే కాకుండా ఓ టీ టీ లో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నట్లు దీని ద్వారా అర్థం అవుతుంది.