సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలు ఎక్కువ శాతం ఒకే రోజు విడుదల కాపు. కనీసం ఒకటి లేదా రెండు రోజుల గ్యాప్ తో అయినా సినిమాలు వస్తూ ఉంటాయి. స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒకే రోజు విడుదల అయినట్లయితే థియేటర్లు సర్దుబాటు చేయడం నిర్మాతలకు చాలా కష్టం అవుతుంది. ఒక వేళ ఒకే రోజు భారీ క్రేజ్ ఉన్న హీరోలు నటించిన సినిమాలను విడుదల చేసినట్లయితే ఆ సినిమాలకు చాలా తక్కువ థియేటర్లు దొరికే అవకాశం ఉంటుంది.
దానితో సినిమా బాగున్న కూడా మొదటి రోజు ఓపెనింగ్స్ పెద్ద స్థాయిలో రావు. ఆ తర్వాత రెండు సినిమాలు బాగున్న ఏ సినిమాకు పెద్ద స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండదు. అలాగే ఏదైనా సినిమా కాస్త బాలేకపోయినా ఆ సినిమాకి కలెక్షన్లు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. దానితో భారీ క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు దాదాపుగా ఒక రోజు విడుదల కాకుండా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఇండియా వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న ముగ్గురు హీరోల నటించిన సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కలిసి వార్ 2 అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం కూలీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయాలి అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ ముగ్గురు హీరోలు నటించిన సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త బలంగా వైరల్ అవుతుంది. ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవుతాయా ... లేదా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.