రష్మిక మందన్నా ఖాతాలో తాజాగా ఓ అరుదైన రికార్డు పడింది.. మరి ఇంతకీ రష్మిక మందన్నా సాధించిన ఆ అరుదైన రికార్డు ఏంటి.. రెండేళ్లలో 3,300 కోట్ల విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చి స్టార్ హీరోయిన్స్ అవుతారు. అలాంటి వారిలో రష్మిక మందన్నా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో ఈ హీరోయిన్ ఇంత పెద్ద పొజిషన్ కి వస్తుంది అని ఎవరు ఉహించలేదు. కానీ ప్రస్తుతం రష్మిక మందన్నా స్థాయి ఎక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అయితే అన్ని పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ గత రెండేళ్లలో ఏకంగా 3,300 కోట్లు వసూళ్లు చేసిన సినిమాల్లో నటించినట్టు తాజాగా ఒక సంచలనం మ్యాటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రష్మిక మందన్నా ఇప్పటికే పుష్ప టు,యానిమల్,ఛావా వంటి సినిమాలతో ఏకంగా రెండేళ్లలో 3,300 కోట్లు వసూలు చేసిన సినిమాల్లో భాగమైందట. ఇక రష్మిక నటించిన ఈ మూడు సినిమాలు హిందీలోనే ఏకంగా 1850 కోట్లు రాబట్టాయని,ఇక ఈ ఈ విషయంలో రష్మిక మందన్నా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయినటువంటి అలియా భట్,దీపిక పదుకొనే వంటి హీరోయిన్లను కూడా వెనక్కి నెట్టి వారి కంటే ఎక్కువ సక్సెస్ రేట్ ని దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక రష్మిక మందన్నా రెండేళ్లలో వరల్డ్ వైడ్ గా 3,300 కోట్లు వసూలు చేసిన సినిమాల్లో నటించడంతో ఈ హీరోయిన్ క్రేజ్ మరింత పెరిగిపోయింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ హీరోగా చేస్తున్న కుబేర మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న సికిందర్ మూవీ లో కూడా నటిస్తుంది. అలా వరుస పాన్ ఇండియా సినిమాలతో జోరు మీదున్న రష్మిక మందన్నా తాజాగా రెండేళ్లలో 3,300 కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాల్లో నటించి అతిపెద్ద సంచలనం సృష్టించింది అంటూ సోషల్ మీడియాలో రష్మిక మందన్నా అభిమానులు పోస్టులు చేస్తున్నారు.ఈ పోస్టులపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రష్మిక మందన్నా ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో కూడా నటిస్తోంది.