సమంతను అంతా తుడిచేస్తున్నారా .. ఆమె విషయంలో ఏం జరుగుతుంది..?

frame సమంతను అంతా తుడిచేస్తున్నారా .. ఆమె విషయంలో ఏం జరుగుతుంది..?

Amruth kumar
స్టార్ డం క్రేజ్ అనేది జీవితాంతం ఉండదు .. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ పాపులారిటీ పాల మీద పొంగు లాంటిది .. దీన్ని ఎన్ని ఎక్కువ రోజులు కాపాడుకోగలిగితే అంత మంచిది .. లేకపోతే ప్రేక్షకులు ఊరికనే మర్చిపోతూ ఉంటారు .. ప్రస్తుతం సమంత పరిస్థితి కూడా ఇంతే .. తెలుగు ప్రేక్షకులు మెల్ల మెల్లగా త‌మ మనసులో నుంచి స‌మంత‌ను తుడిచేస్తున్నారు అనేది వాస్తవం .. ఎందుకంటే ఈమె తెలుగు లో సినిమాలు చేయట్లేదు .. అలాంటప్పుడు ఈమె ని గుర్తు పెట్టుకోవాల్సిన పని ఏముంది ?

కాబట్టి ఇక్కడ ప్రేక్షకులను ఆమె నిందించాల్సిన పనిలేదు తప్పు సమంతా లోనే ఉంది కాబట్టి .. మొన్నటి వరకు ఆమె ఆరోగ్య సమస్యల తో ఇబ్బంది పడింది కాబట్టి ఎవరు ఆమెను ఏమీ అనలేదు .. కనీసం ఆరోగ్యం కొలికొన్న తర్వాత అయినా సినిమాలు చేయాలి కదా .. సినిమాల ను పక్కన పెట్టి వరుసగా వెబ్ సిరీస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది .. ప్రత్యేకంగా ముంబైకే ఈమె పరిమితం అవుతుంది . అలాంటప్పుడు టాలీవుడ్ లో ఈమె గురించి మాట్లాడుకోవాల్సిన పని ఏముంటది ? ఈ ప్రమాదాన్ని ఇప్పటికే పసిగ‌ట్టింది సమంత ..

 రీసెంట్గా ఆమె పై వరుసగా స్టోరీలు కూడా బయటకు వస్తున్నాయి .. ఇదిగో సినిమా .. అదిగో కొత్త ప్రాజెక్ట్ అంటూ రకరకాల వార్తలు పుట్టిస్తున్నాయి .. అయితే ఇదంతా సమంతాను వార్తల్లో హైలైట్ చేసేందుకు ఆమె పిఆర్ టీం పడుతున్న కష్టం తప్ప ఇంకోటి ఏమీ లేదు .. ఇప్పటికే ప్రకటించిన సినిమాని సమంత ఇప్ప‌టివ‌ర‌కు సెట్స్ పైకి తీసుకువెళ్లలేదు .. ఇప్పుడు మరో కొత్త సినిమాలు అంటూ లీకులు .. సొంత ప్రమోషన్లు కూడా ఎక్కువ కాలం పని చెయ్యవు .. మరి సమంత టాలీవుడ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: