జాతి రత్నాలు మూవీ తో ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ హోదాలోకి వెళ్లిపోయారు డైరెక్టర్ అనుదీప్ కేవి. ఈయన పాన్ ఇండియా డైరెక్టర్ అయినటువంటి నాగ్ అశ్విన్ ఇద్దరు చాలా మంచి స్నేహితులు.. ఇక అనుదీప్ కేవీ మొదట తన సినీ ప్రస్థానాన్ని పిట్టగోడ అనే మూవీతో మొదలుపెట్టారు.ఈ సినిమా తర్వాత జాతరత్నాలు మూవీ తీశారు. నవీన్ పోలిశెట్టి,ఫరియా అబ్దుల్లా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబినేషన్లో వచ్చిన జాతి రత్నాలు మూవీ ఎంత పెద్ద హిట్టో చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చి అతి పెద్ద హిట్ కొట్టడంతో ఈ డైరెక్టర్ పేరు జాతరత్నాలు డైరెక్టర్ గా మారిపోయింది. ఆ తర్వాత కల్కి 2898 ఏడి,మ్యాడ్ సినిమాలో చిన్న పాత్రల్లో నటుడిగా కూడా కనిపించారు. ఇక తమిళ్ లోకి కూడా ప్రిన్స్ అనే మూవీ తో ఎంట్రీ ఇచ్చారు.
అంతేకాదు త్వరలోనే జాతి రత్నాలు 2 మూవీ ని కూడా తీస్తానని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఈ సినిమా చూసి ఎంతమంది కడుపుబ్బా నవ్వుకున్నారో చెప్పనక్కర్లేదు. అలా ఒక మంచి కామెడీ సినిమాను అందించి డైరెక్టర్ గా పాపులర్ అయిపోయారు అనుదీప్ కేవి. అయితే డైరెక్టర్ అనుదీప్ కె.వి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి,కాబోయే భార్య గురించి మాట్లాడుతూ.. అసలు నాకు పెళ్లి అవుతుందో లేదో సింగిల్ గా ఉంటానో మాత్రం తెలియదు. అలాగే లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. అసలు నేను పెళ్లి ఎలా చేసుకుంటానో కూడా క్లారిటీ లేదు అంటూ పెళ్లి విషయం గురించి ప్రశ్నించిన సమయంలో కాస్త అసహనంగా జవాబు చెప్పారు అనుదీప్ కేవి.
అయితే ఆయన్ని గమనించిన యాంకర్ మీరు పెళ్లి గురించి కాస్త నర్వస్ గా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందుగా మీ ఫ్రెండ్స్ తో లేక మీరంటే బాగా తెలిసిన వాళ్ళతో మీ కాబోయే భార్యతో మాట్లాడించి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసేలా చేయండి. అలా అయితేనే మీకు కాబోయే భార్య మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటుంది అంటూ యాంకర్ చెప్పారు. అలాగే మీ ఫ్రెండ్ నాగ్ అశ్విన్ కి ఈ విషయం చెప్పకపోయారా అని అడిగితే.. నాగ్ అశ్విన్ నాకు ప్రతిసారి పెళ్లి సంబంధాలు చూడాలా అని అడుగుతూ ఉంటాడు అంటూ డైరెక్టర్ అనుదీప్ కేవి తన పెళ్లి పై స్పందించారు.